ఆధార్ కార్డులో ఏదైనా అప్డేట్ చేయాలా? ఇలా ఇంటిదగ్గరే ఫ్రీగా చేస్కొండి.. లాస్ట్ డేట్ ఇదే..

www.mannamweb.com


మీ ఆధార్ కార్డు సరిగానే ఉందా. ఏమైనా తప్పులున్నాయా. పేరు, ఫోన్ నంబర్, ఇ- మెయిల్ ఐడీ, అడ్రస్, ఫొటో ఇలా అన్నీ అప్‌ టూ డేట్ ఉన్నాయా. ఏదైనా అప్డేట్ చేసుకోవాలా? ఆధార్ కార్డు భారతీయులకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ కాబట్టి.. ఇందులో ఎలాంటి తప్పులు ఉండకుండా చూసుకోవాలి. ఇంకా ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు అవుతుందా. ఈ మధ్యలో అసలు ఒక్కసారి కూడా అప్డేట్ చేయలేదా. అయితే కచ్చితంగా చేయాల్సిందే. ఆధార్ కార్డు సరిగా ఉంటేనే.. అన్ని రకాల బెనిఫిట్స్ పొందుతారు. అందుకే.. ఇలాంటి వారిని ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలని కేంద్రం సూచిస్తుంది. ఇక ఇందుకోసం గత కొంతకాలంగా ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది.

ఆధార్ కార్డులో మీరు ఇలాగే ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే.. అందుకు ఎలాంటి ఖర్చు లేకుండా.. ఇంటి దగ్గరే ఉండి అప్డేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ కార్డులో పేరు, పుట్టినతేదీ సహా అడ్రస్ వంటి వివరాల్ని ఉచితంగా ఆన్‌లైన్ ద్వారా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఈ ఫ్రీ అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతిసారీ 3 నెలల సమయం ఇస్తూ.. మళ్లీ పొడిగిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆధార్ ఫ్రీ అప్డేట్.. 2024, సెప్టెంబర్ 14గా ఉంది.

అయితే మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నప్పుడే సులభంగా ఈ సేవలు పొందొచ్చు. ఆధార్ కార్డుకు సంబంధించి చాలా మంది అప్డేట్ ఉంటే.. మీ సేవ కేంద్రానికో.. ఆధార్ సర్వీస్ సెంటర్‌కో వెళ్తుంటారు. అయితే.. ఆ పనిలేకుండా మైఆధార్ పోర్టల్ ద్వారా ఇంట్లో కూర్చొనే ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్, ఫేషియల్ ఫొటోగ్రాఫ్ మాత్రం ఆఫ్‌లోన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది.

యూఐడీఏఐ జారీ చేసే 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యనే ఆధార్. ఇందులో సదరు వ్యక్తి పూర్తి సమాచారం బయోమెట్రిక్‌తో కూడా నిక్షిప్తమై ఉంటుంది. ఇలా ఆధార్ కార్డులో వివరాల్ని అప్డేట్ చేసుకునేందుకు ముందుగా మైఆధార్ పోర్టల్‌ను సందర్శించాలి. అక్కడ మీ ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి.. మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ వివరాలు సరిచూస్కొని .. వెరిఫై చేసుకోవాలి. కింద డ్రాప్ డౌన్ చేసి.. ఐడెంటిటీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. తర్వాత అడ్రస్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేసి.. వివరాల్ని అప్డేట్ చేసుకోవచ్చు. బయట ఆధార్ కేంద్రాల్లో అయితే ఇందుకోసం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.