అనేక ఆరోగ్య ప్రయోజనాలు, ఉపయోగాలున్నందున నేటికీ పలు గ్రామాల్లో వేప చెట్టును దేవతగా పూజిస్తారు. వేప చెట్టు ఉండటం వల్ల ఆ ప్రదేశంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీలు తగ్గుతుందని కూడా చెబుతారు.
ఈ కథనంలో వేప ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.. వేప ఆకులు క్యాన్సర్ నుండి చుండ్రు వరకు అనేక వ్యాధులను నయం చేస్తాయి. వేప పువ్వు, వేప ఆకు మాత్రమే కాకుండా, వేప చెట్టు బెరడు, వేప పండు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
ఔషధంగా..
వేప రసాన్ని తాగడం వల్ల జీర్ణకోశ వ్యాధులు నయం అవుతాయి. ఇది వేసవిలో వేడి ప్రేరేపిత తట్టుకు ఔషధంగా కూడా ఉపయోగించబడుతుంది. వేప ఆకులను పసుపుతో గ్రైండ్ చేసి తట్టు ఉన్న చోట రాస్తే దురద, చికాకు, తట్టు మచ్చ మొదలైనవి మాయమవుతాయి.
వేప ఆకులను మెత్తగా నూరి ఎదిగే పిల్లలకు ఉదయం ఖాళీ కడుపుతో 15 మి.లీ చొప్పున ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగుతుంది. అంతేకాకుండా, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
మీరు విషపూరితమైన క్రిమి లేదా పాము కాటుకు గురైనట్లయితే, వెంటనే వేప ఆకులను తినండి, విషం శరీరం అంతటా వ్యాపించకుండా ఉంటుంది.
ముఖం మెరిసిపోతుంది: వేప ఆకుల్లో ఉండే విటమిన్స్ చర్మ సంబంధిత సమస్యలను తొలగిస్తాయి. వేప ఆకులను పసుపుతో కలిపి మెత్తగా చేసి ముఖానికి రాసుకుని 30 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు, నల్లమచ్చలు మాయమై ముఖం మెరిసిపోతుంది. చెమట, దురద, పుండ్లు వంటి వాటికి వేపపిండిని మెత్తగా నూరి రాసుకుంటే ఎంతో మంచిది.
క్యాన్సర్ ఏర్పడకుండా: వేప ఆకులు క్యాన్సర్ కారక కణాలను చంపి, క్యాన్సర్ ఏర్పడకుండా నిరోధించే క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంది.
చుండ్రు: వేప ఆకులను మరిగించిన తర్వాత చల్లార్చి తలస్నానం చేస్తే చుండ్రు, కీటకాల కాటు నుండి విముక్తి లభిస్తుంది.
దంత క్షయం: వేప ఆకులను పచ్చిగా నమలడం వల్ల చిగుళ్ల సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. దంత క్షయం, నోటి దుర్వాసన కూడా రాకుండా చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)