Motivation: నెగిటివ్ ఆలోచనలతో అనర్ధాలే, వాటిని ఇలా తగ్గించుకోండి

కొంతమందికి నెగిటివ్ ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఏమీ జరగకుండానే ఏమైనా జరిగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. ఏ చిన్న పని చేయాలన్నా…
వారిలో మొదలయ్యేవి ప్రతికూల ఆలోచనలే మొదటే. ఇలా ప్రతిసారి ప్రతికూల ఆలోచనలను వల్ల ఒరిగేది ఏమీ లేదు. మిమ్మల్ని విజయం వైపు వెళ్లకుండా అడ్డుకునేవి కూడా ఈ ఆలోచనలే. కాబట్టి వాటిని మీ మనసులోంచి ఎంతగా తీసేస్తే మీకు విజయం అంతగా దగ్గరవుతుంది. ప్రతికూల ఆలోచనల వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం… రెండు దెబ్బతింటాయి. కాబట్టి నెగటివ్ ఆలోచనలను వదిలించుకోవాలి.


నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మీకు నచ్చిన పనులు చేయాలి. వండడం, పుస్తకాలు చదవడం, పాటలు వినడం, వాకింగ్‌కి వెళ్లడం వంటి వాటి ద్వారా మనసును మళ్లించుకోవచ్చు. అప్పటికీ ఆలోచనలు వస్తే ఎవరైనా మనసుకు నచ్చిన వారితో ఫోన్లో మాట్లాడుకోవచ్చు. అలా మనసును మళ్లించడం ద్వారా ఆలోచనలను తగ్గించవచ్చు.
సానుకూల ఆలోచనలను పెంచే పుస్తకాలు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. వాటిని తెచ్చుకొని ప్రతిరోజు చదవడం ద్వారా కూడా మీ ఆలోచనలను మార్చుకోవచ్చు. మీకు నచ్చని విషయాలను ప్రతిరోజూ డైరీలో రాయడం అలవాటు చేసుకోండి. మనసులోంచి విషయాలు బయటకు పోతే వాటి వల్ల కలిగే ఆలోచనలు తగ్గుతాయి. అందుకే ఎక్కువ మంది డైరీని రాస్తూ ఉంటారు. ఎంతో మహోన్నత వ్యక్తులకు డైరీలు రాసే అలవాటు ఉంది. సానుకూలమైన మాటలు మాట్లాడే వారు, నెగటివ్ మాటలకు దూరంగా ఉండే వారితోనే స్నేహం చేయండి.

మనసు అంటేనే ఆలోచనల మూట. మనసులో ఏవో ఆలోచనలు నిత్యం నడుస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనలు 90% సానుకూలమైనవి అయితేనే మనం జీవితంలో సంతోషంగా జీవించగలం. ఒత్తిడి, అసంతృప్తితో జీవించే వాళ్లకు ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలే వస్తాయి. కనుక జీవితంలో మీరు సంతోషాన్ని చిన్నచిన్న విషయాల్లోనే వెతుక్కోవాలి.అలా అయితేనే ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి.

వైఫల్యం గురించి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే విజయం గురించి ఆలోచించడం ప్రారంభించండి. ఏదైనా చెడు జరుగుతుందేమో అని ఒక నెగిటివ్ థింకింగ్ మొదలవ్వగానే… మీ ఇష్ట దైవాన్ని తెలుసుకోండి. మీకు నిరాశ కమ్మినప్పుడు మీ జీవితంలో జరిగిన మంచిని ఒకసారి గుర్తు చేసుకోండి. గత వైఫల్యాలను పునాదులుగా భావించండి. అంతేతప్ప వాటిని తలుచుకొని నిరాశ పడవద్దు. ముందు మీకు మీరు సానుకూలంగా మారాలన్న నిర్ణయానికి రండిజ. మీరు ఎంత గట్టిగా ఆ నిర్ణయం తీసుకుంటే మీలో మార్పు త్వరగా వస్తుంది.