Nestle Cerelac Side Effects: చిన్న పిల్లలకు తల్లిపాల కంటే బలవర్ధకమైన ఆహారం మరొకటి లేదు. అందుకే డెలివరీ అయిన మహిళలు పిల్లలకు కనీసం ఆరు నెలలైనా తల్లిపాలు తాగించాలి. అప్పుడే వారు రోగనిరోధక శక్తిని పెంచుకొని సీజనల్ వ్యాధులను తట్టుకుంటారు. అయితే చాలామంది మహిళలకు పాలు సరిపడ రావు. దీంతో వారు ప్రత్యామ్యాయంగా నెస్లే సెర్లాక్‌ని తినిపిస్తారు. మరికొందరు పాలను మరిపించి ఫుడ్‌పైదృష్టిపెట్టడానికి సెర్లాక్‌ను అలవాటు చేస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ సెర్లాక్ వల్ల పిల్లలకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.
సెర్లాక్ ప్రొడక్ట్ ను నెస్లే కంపెనీ తయారు చేస్తుంది. వివిధ ఫ్లేవర్స్ తో 15 రకాలుగా మార్కెట్ లో అందుబాటులో ఉంది. తాజాగా చేసిన పబ్లిక్ ఐ పరిశోధనలో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. భారత్ లో తయారుచేసే సెరెలాక్‌లో 3 గ్రాముల షుగర్ ఉంటుందని పరిశోధనలో తేలింది. అంతే కాదు ఇందులో చక్కెర, తేనే కలుపుతున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం చిన్నారుల కోసం తయారు చేసే ఫుడ్ ఐటమ్స్ లో చక్కెర స్థాయిలు ఉండకూడదు. ఊబకాయం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి పేద దేశాల్లో నెస్లే ఈ నిబంధనను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్టు తేలింది.
చాలా సందర్భాల్లో నెస్లే సెర్లాక్ కంపెనీ షుగర్ లెవల్స్ గురించి ప్యాకేజింగ్‌పై ముద్రించట్లేదని పబ్లిక్ ఐ పేర్కొంది. దీనివల్ల పిల్లలకు చక్కెర వ్యసనంగా మారే అవకాశం ఉంది. తీపికి అలవా టు పడ్డ చిన్నారులు అలాంటి ఆహారాల వైపే మొగ్గు చూపుతారు. ఫలితంగా చిన్నతనంలో తగిన పోషకాలు అందక పెద్దాయ్యాక అనారోగ్యాల బారిన పడుతారు. అందుకే చిన్నపిల్లలకు సెర్లాక్ తినిపించే ముందు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.