పూజ సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..! కష్టాలు వెంటాడుతాయి జాగ్రత్త

శివలింగాన్ని శివుడికి చిహ్నంగా భావిస్తారు. శివలింగంలో మొత్తం విశ్వం శక్తి ఉంటుందని నమ్ముతారు. అందుకే పూజ సమయంలో కానీ ఇతర సమయాల్లో శివలింగాన్ని నేలపై ఖాళీగా ఉంచకూడదు.


శివలింగాన్ని ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలోనే ఉంచాలి.

చాలా మంది విగ్రహాన్ని శుభ్రం చేసే సమయంలో నేలపై ఉంచుతారు. విగ్రహాన్ని నేలపై ఉంచి శుభ్రం చేయకూడదు. అలాగే గుడిని శుభ్రం చేసేటప్పుడు కూడా విగ్రహాన్ని నేలపై ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల దేవుడిని అవమానించినట్లు అవుతుంది. దీనివల్ల ఇంటిలోని సుఖశాంతులు చెడిపోతాయి.

పూజ సమయంలో దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వాస్తు నియమం ప్రకారం పూజ సమయంలో దీపం వెలిగించి నేలపై ఖాళీగా ఉంచకూడదు. దీపం వెలిగించిన తర్వాత దాని కింద అక్షంతలు ఉంచాలి.

శంఖానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మతపరమైన కార్యక్రమాలలో శంఖం ఊదడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఏ ఇంట్లో అయితే పూజ సమయంలో ప్రతిరోజు శంఖం ఊదుతారో అక్కడ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. శంఖాన్ని ఎప్పుడూ ఖాళీ నేలపై ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది.

శాలిగ్రామాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. శాలిగ్రామం విష్ణువుకు చిహ్నం. అందుకే విష్ణువు పూజలో శాలిగ్రామానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఏ ఇంట్లో అయితే శాలిగ్రామం ఉంటుందో అక్కడ సుఖసంతోషాలు వస్తాయి. కానీ దీనిని నేలపై ఉంచడం వల్ల నష్టం కలుగుతుంది. శాలిగ్రామాన్ని ఎప్పుడూ ఖాళీ నేలపై ఉంచకూడదు.