సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త బార్‌ పాలసీ: సీఎం చంద్రబాబు

సెప్టెంబర్‌ 1 నుంచి రాష్ట్రంలో కొత్త బార్‌ పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా కొత్త బార్‌ పాలసీ ఉండనున్నట్లు పేర్కొన్నారు.


మద్యం పాలసీ అంటే ఆదాయం కాదు.. ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమన్నారు. ఆల్కహాల్‌ కంటెంట్‌ తక్కువగా ఉండే మద్యం అమ్మకాలతో నష్టాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. మద్యం కారణంగా పేదల ఇల్లు, ఒల్లు గుల్ల కాకుండా చూడాలన్నారు. బార్లలోనూ గీత కార్మిక వర్గాలకు 10 శాతం షాపులు కేటాయించనున్నట్లు సీఎం తెలిపారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.