గుండె సంరక్షణ కోసం చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఆస్పిరిన్ మందు ఇప్పుడు మారవచ్చని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. తాజా పరిశోధనలో ఏం తేలిందంటే..
క్లోపిడోగ్రెల్ (Clopidogrel) అనే మరో ఔషధం, ఆస్ప్రిన్ కంటే మరింత ప్రభావవంతంగా గుండెపోటు, స్ట్రోక్‌లను తగ్గించగలదని పరిశోధకులు చెబుతున్నారు. ఇది రక్తాన్ని పలుచబరిచే ఔషధం, కానీ ఆస్ప్రిన్ లాగా రక్తస్రావం ప్రమాదం పెంచదని తేలింది.
తాజా పరిశోధనలో ఏమి తేలింది?
యూరోప్‌లో జరిగిన కార్డియాలజీలో దాదాపు 29,000 మంది రోగులపై చేసిన 7 క్లినికల్ ట్రయల్స్ క్లోపిడోగ్రెల్.. గుండెపోటు, స్ట్రోక్‌లు వంటి సమస్యలను ఆస్ప్రిన్ కంటే 14% ఎక్కువగా తగ్గించింది. రక్తస్రావం ప్రమాదం ఆస్ప్రిన్‌తో సమానంగా ఉంది. దీని ప్రభావం వాడిన రెండు గంటల్లో మొదలై 5 రోజులపాటు ఉంటుంది. ఈ ఫలితాల ఆధారంగా, నిపుణులు గుండె సంబంధిత వ్యాధుల నివారణకు ఆస్ప్రిన్ స్థానంలో క్లోపిడోగ్రెల్ ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.































