మార్కెట్ లోకి న్యూ EV.. సింగిల్ ఛార్జ్ తో 120KM రేంజ్

www.mannamweb.com


ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వెహికిల్స్ హవా కొనసాగుతున్నది. పెరిగిన పెట్రోల్ ధరల కారణంగా ఈవీలకు ప్రియారిటీ ఇస్తున్నారు వాహనదారులు. టూవీలర్ కొనాలనే ప్లాన్ లో ఉన్నవారు బెస్ట్ ఈవీల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు అడ్వాన్డ్స్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈవీలు నడపడానికి ఈజీగా ఉండడం.. ప్రయాణ ఖర్చులు తగ్గడం.. పర్యావరణ హితంగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో మార్కెట్ లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ అయ్యింది. డియాన్ సంస్థ ఆగస్టా ఎస్పీ పేరిట కొత్త ఈవీని తీసుకొచ్చింది.

అగస్టా ఎస్పీ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. గంటకు 100కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. 5-6 గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. దీనిలో 7.5 కేడబ్ల్యూ పీక్ పీఎంఎస్ఎం హబ్ మోటార్‌తో పనితీరును చాలా సమర్థంగా ఉంటుంది. ఈ స్కూటర్ బరువు 100 కేజీలు కలిగి ఉంది. వెనుక స్ప్రింగ్ లోడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ప్రత్యేకంగా అమర్చారు. అలాగే ఆస్టా ఎఫ్ హెచ్ వెనుక మోనో స్ప్రింగ్ లోడ్ హైడ్రాలిక్ సెటప్‌తో కూడిన అధునాతన బ్రేకింగ్ సిస్టమ్‌ ఉంది. ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్ లను అందించారు. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వల్ల భద్రత, సౌకర్యం మరింత పెరుగుతుంది. దీనిలో యాంటీ థెఫ్ట్ లాక్‌లు, ఫ్రంట్ ప్రొజెక్టర్ ఎల్ఈడీలు, వెనుక వైపు సాధారణ ఎల్ఈడీలు ఉన్నాయి. ధర విషయానికి వస్తే ఆగస్టా ఎస్పీ రూ.1,79,750గా కంపెనీ నిర్ణయించింది. రూ. 999తో ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న 60 రోజుల్లో ఈ స్కూటర్ డెలివరీ చేస్తారు.

డియాన్ కంపెనీ నుంచి మరో ఈవీ కూడా అందుబాటులో ఉంది. అస్టా పేరిట మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను రిలీజ్ చేసింది. దీని ధర రూ. 1,29,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఈవీని కూడా రూ. 999తో ప్రీ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న వెంటనే కంపెనీ డెలివరీ చేస్తుంది. గంటకు 85 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. సింగిల్ చార్జ్ తో 80-120కి.మీల వరకు ప్రయాణించొచ్చు.