వందే భారత్‌ రైళ్ల బుకింగ్‌లో కొత్త సదుపాయం

వందే భారత్‌ రైలు బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్‌ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో… దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు.


వందే భారత్‌ రైలు(Vande Bharat Train) బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్‌ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో… దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేలా రైలు బయల్దేరే 15 నిమిషాలకు ముందు ఖాళీ సీట్ల వివరాలు తెలుపుతామని, ఆ సీట్లు ప్రయాణికు లు రిజర్వేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ఈసౌకర్యం మంగళూరు సెంట్రల్‌-తిరువనంతపురం (నెం.20631), తిరువనంతపురం-మంగళూరుసెంట్రల్‌(నెం.20632),చెన్నై ఎగ్మూర్‌-నాగర్‌కోయిల్‌(నెం.20627),నాగర్‌కోయిల్‌-చెన్నై ఎగ్మూర్‌ (నెం.20628), కోయంబత్తూర్‌-బెంగళూరు కంటోన్మెంట్‌ (నెం.20642), చెన్నై సెంట్రల్‌-విజయవాడ(Chennai Central – Vijayawada) (నెం.20677). మంగళూరు సెంట్రల్‌-మడగావ్‌ (నెం.20646), మదురై-బెంగళూరు కంటోన్మెంట్‌ (నెం.20671) తదితర 8 వందే భారత్‌ రైళ్లకు కల్పించినట్లు అధికారులు తెలిపారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.