కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. న్యూ బిగినింగ్ అంటూ న్యూ హౌస్ నేమ్ రివీల్

బుల్లితెర యాంకర్ నుంచి వెండితెరపై మెరిసిన అనసూయ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ టాలెంట్‌కు దర్శక, నిర్మాతలు ప్రముఖ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో అవకాశాలు ఇస్తున్నారు.


ఇప్పటికే ఈ అమ్మడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం అండ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప రెండు భాగాల్లో నటించి ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ సునీల్ కు భార్యగా నటించి.. తనలోని ప్రతిభను చాటింది.

ఇకపోతే ఈ యాంకర్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలోని అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తరచూ హాట్ హాట్ ఫొటో షూట్లతో పాటు అప్పుడప్పుడు శారీలో సంప్రదాయ లుక్‌లో కూడా దర్శనమిచ్చి నెటిజన్లను మెస్మరైజ్ చేస్తుంటుంది. అయితే తాజాగా అనసూయ యాంకర్ తాజాగా ఓ పోస్ట్ పంచుకుంది. అనసూయ తాజాగా కొత్తింట్లోకి అడుపెట్టగా గృహప్రవేశం వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పిక్స్ పంచుకుంటూ ”ఆ సీతారామఆంజనేయ కృప తో.. మా తల్లిదండ్రుల ఆశీర్వాదం తో.. మీ అందరి ప్రేమతో, మా జీవితంలోని మరో అధ్యయనం వెలుగుచూసింది. శ్రీరామసంజీవని మా కొత్తింటి పేరు జైశ్రీరామ్ జైహనుమాన్. న్యూ బిగినింగ్స్ థాంక్ఫుల్ హార్ట్ కృతజ్ఞత ఆశీర్వాదం” అంటూ అనసూయ రాసుకొచ్చింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.