ఈ మధ్య ఎక్కువగా మార్కెట్‌లో అమ్ముడుపోతున్న ఎస్‌యూవీలలో ‘మహీంద్రా థార్’ ఒకటని చెప్పొచ్చు. ఈ సంస్థ నుంచి ‘మహీంద్రా థార్ రాక్స్’ అనే న్యూ వెర్షన్ ఎస్‌యూవీ..
ఇటీవలే భారత మార్కెట్‌లోకి లాంచ్ అయింది. రూ. 12.99 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూమ్)కు లభిస్తోన్న ఈ ఎస్‌యూవీ 5 డోర్ మోడల్‌తో వస్తోంది. ఇది మహీంద్రా థార్ 3 డోర్ మోడల్‌కి ఎక్స్‌టెండెడ్ వెర్షన్. 3-డోర్ థార్ వెర్షన్‌తో ఈ థార్ రాక్స్ అమ్మకాలు జరుగుతాయని సంస్థ ప్రకటించింది. మరి ఈ రెండు ఎస్‌యూవీల మధ్య వ్యత్యాసాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందామా..
థార్ వెర్సస్ థార్ రోక్స్- డిజైన్, కలర్ ఆప్షన్లు..
3 డోర్ థార్ వెర్షన్ కంటే థార్ రోక్స్ సరికొత్త డిజైన్‌తో తయారైంది. సీ-షేప్డ్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్‌లు, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లతో పాటు సరికొత్తగా ఫ్రంట్ గ్రిల్ లాంటివి థార్ రోక్స్‌కు మరింత స్టైలిష్‌నెస్‌ను ఇచ్చాయి. ఇక కొత్త డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌తో సైడ్ ప్రొఫైల్ సూపర్ హిట్ అని చెప్పొచ్చు. పొడవైన, వెడల్పైన రన్నింగ్ బోర్డ్లు, స్క్వేర్డ్ రియర్ వీల్ ఆర్చ్‌లతో పాటు వెనుక వైపున అమర్చిన క్వార్టర్ గ్లాస్ థార్ రోక్స్, 3-డోర్ థార్‌కి మధ్య ఉన్న వ్యత్సాసాన్ని స్పష్టం చేస్తుంది. ఇక థార్ రోక్స్ ఏడు కలర్ ఆప్షన్లతో మార్కెట్‌లోకి వచ్చింది. అటు 3-డోర్ థార్ కేవలం ఐదు కలర్ ఆప్షన్లతోనే అందుబాటులో ఉంది.
థార్ వెర్సస్ థార్ రోక్స్ – ఫీచర్లు, పరిమాణం
3 డోర్ థార్ మోడల్‌తో పోలిస్తే థార్ రోక్స్ వెర్షన్ ఎందులోనూ తక్కువ కాదని చెప్పొచ్చు. 443 మిమీ పొడవైన పరిమాణం, అత్యంత వెడల్పు, పొడవైన వీల్‌బేస్‌తో.. కంఫోర్టబుల్, సుఖవంతమైన ప్రయాణానికి సరిగ్గా సరపడా రీతిలో మహీంద్రా సంస్థ ఈ థార్ రాక్స్‌ని తయారు చేసింది. పానోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ సీటింగ్, ప్రీమియం హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ లాంటి ప్రత్యేకమైన ఫీచర్లు థార్ రోక్స్‌లో ఉన్నాయి. 26.03 సెంటీమీటర్ల డ్యుయల్ స్క్రీన్‌లతో అప్‌గ్రేడెడ్ డిజిటల్ కాక్‌పిట్ విత్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సౌకర్యంతో వస్తోంది. ఇక భద్రతా ప్రమాణాల విషయానికొస్తే.. డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్, సైడ్ సీట్‌తో పాటు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు అన్ని చోట్లా అమర్చబడి ఉన్నాయి. ఇవి అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా మనల్ని రక్షించగలవు.
పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఇలా..
అటు డీజిల్.. ఇటు పెట్రోల్ వేరియంట్లలో మహీంద్రా థార్ రాక్స్ మార్కెట్‌లోకి అందుబాటులో ఉంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పెట్రోల్ వేరియంట్ 152హెచ్‌పీ, 330 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ విషయానికొస్తే.. 177హెచ్‌పీ, 380ఎన్‌ఎం టార్క్‌తో పని చేస్తుంది. మరోవైపు, మహీంద్రా థార్ రోక్స్‌లోని బేస్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ వెర్షన్ 162హెచ్‌పీ, 330 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇదిలా ఉంటే.. 4X4 పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో కూడిన హై-లెవెల్ స్పెసిఫికేషన్ మోడల్‌లు 175హెచ్‌పీ, 370ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 3-డోర్ థార్ విషయానికొస్తే.. 1.5 లీటర్ యూనిట్ 116హెచ్‌పీ, 300 ఎన్‌ఎం ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్, ఆర్‌డబ్ల్యూడీ లేఅవుట్ కూడా ఉన్నాయి. 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ వేరియంట్‌తో వచ్చే 3-డోర్ థార్ 151హెచ్‌పీ, 320ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
థార్ వెర్సస్ థార్ రోక్స్: ధర
3-డోర్ థార్ మోడల్ వేరియంట్లు రూ. 11.35 లక్షల నుంచి రూ. 17.60 లక్షల వరకు ఉండగా.. థార్ రోక్స్ ప్రారంభ ధర రూ. 12.99 లక్షలుగా నిర్దేశించబడింది. ఇక టాప్-స్పెసిఫికేషన్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్‌ల ధర రూ.20.49 లక్షలుగా ఉంది.(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్‌తో చెప్పినవి)