200MP కెమెరాతో కొత్త ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. పవర్‌ఫుల్ ప్రాసెసర్

www.mannamweb.com


Honor Magic 7 Pro : ఈ మధ్యకాలంలో ఫోన్‌ కెమెరా ఎంత క్లారిటీ ఉందనే విషయాన్ని చూసే చాలా మంది స్మార్ట్‌‌ఫోన్ కొనుకుంటున్నారు. అయితే హానర్ ‌మంచి కెమెరాతో ఫోన్ తీసుకురానుంది. బ్యాటరీ కూడా బాగుంటుంది. పవర్‌ఫుల్ ప్రాసెసర్ వస్తుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. అవేంటో చూద్దాం..

హానర్ మ్యాజిక్ 7 ప్రో త్వరలో మార్కెట్లోకి రానుంది. లాంచ్‌కు ముందు ఈ ఫోన్ వివరాలు లీక్ అయ్యాయి. లీకైన నివేదికల ప్రకారం, కంపెనీ ఈ ఫోన్‌లో గొప్ప కెమెరా సెటప్‌ను అందించబోతోంది. కెమెరా 180 మెగాపిక్సెల్ లేదా 200 మెగాపిక్సెల్ కావచ్చు.

హానర్ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ మ్యాజిక్ 7 సిరీస్‌లో ఉండనున్నాయి. ఈ సిరీస్ లాంచ్ తేదీ గురించి కంపెనీ నుండి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, కంపెనీ ఈ సిరీస్‌ను ఈ ఏడాది నవంబర్‌లో లాంచ్ చేయవచ్చు. కొత్త సిరీస్ ప్రారంభించడానికి ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉంది. లీకుల ఆధారంగా ఫోన్ డిజైన్‌ను సిద్ధం చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

టిప్ స్టర్ షేర్ చేసిన వివరాలు చూస్తే.. ఫోన్ వెనుక కెమెరా లుక్ మ్యాజిక్ 6 సిరీస్‌ను పోలి ఉందని చెప్పవచ్చు. మునుపటి సిరీస్ కెమెరా మాడ్యూల్ త్రిభుజాకార డిజైన్‌లో ఉంది. కానీ మ్యాజిక్ 7 ప్రోలో కంపెనీ ఎల్ఈడి ఫ్లాష్‌తో స్క్వేర్ డిజైన్ కెమెరా సెటప్‌ను అందించబోతోంది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే 180 లేదా 200 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్‌పీ3 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను ఈ ఫోన్‌లో పొందవచ్చు. ఇది గొప్ప జూమ్ క్వాలిటీతో వస్తుంది.

ఫోన్ ఎగువ ఎడమ మూలలో కంపెనీ లిడార్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్, కలర్ టెంపరేచర్ సెన్సార్లను అందించబోతోంది. ఇది ఫోన్ ఆటోఫోకస్ నాణ్యతను, మెరుపును మెరుగుపరుస్తుంది. దీంతోపాటు ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ ఓవీ50కే మెయిన్ కెమెరాను అందించారు. అంతేకాదు ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను అందించనున్నారు.

స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్‌ను ఈ ఫోన్‌లో ప్రాసెసర్‌గా కంపెనీ అందించనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఫోన్ డిస్‌ప్లే క్వాడ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్ అని, ఇది పిల్ షేప్ కటౌట్‌తో వస్తుందని చెబుతున్నారు. ఫోన్ 1.5కే రిజల్యూషన్ డిస్ ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌కు పవర్ ఇవ్వడానికి కంపెనీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇస్తుంది.