సంక్రాంతికి కొత్త రేషన్‌ కార్డులు

www.mannamweb.com


విభజన, మార్పులు, చేర్పులకు అవకాశం

న్యూస్‌టుడే, వినుకొండ: కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా కొత్త రేషన్‌ కార్డుల జారీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వైకాపా ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ కార్డుల విభజన, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డు ప్రామాణికంగా పరిగణిస్తారు. సామాజిక పింఛన్లు మంజూరు చేయాలన్నా.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలన్నా.. తెల్లరేషన్‌ కార్డు తప్పనిసరి. ఐదేళ్లగా జగన్‌ పాలనలో రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులకు కఠిన నిబంధనలు అమలు చేయడం వల్ల వేల మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోలేకపోయారు. నాటి తప్పిదాలను సరిదిద్ది అర్హులందరికీ ఈ ప్రభుత్వం అవకాశం కల్పించనుంది.

నూతన రేషన్‌కార్డుల కోసం డిసెంబర్‌ 2 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. సంక్రాంతి లోపు అర్హులను గుర్తించి అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొత్తరేషన్‌ కార్డులు జారీ చేస్తారు. ఆరంచెల విధానంలో నాటి వైకాపా ప్రభుత్వం వడపోసి అప్పటికే ఉన్న కార్డులను తొలగించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వివాహం జరిగితే విభజన చేసుకునేందుకు పెళ్లి ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేయడంతో విభజనకు అవకాశం లేకుండా పోయింది. తాజాగా కొత్తగా పెళ్లైన వారికి రేషన్‌ కార్డులు ఇవ్వాలన్న నిర్ణయం అమల్లో ఉన్నందున అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త కార్డులు ఇవ్వనున్నారు. కొత్త జంటలతో పాటు తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారికి కొత్త బియ్యం కార్డులు దక్కనున్నాయి.

జిల్లాలో మొత్తం

చౌక దుకాణాలు: 1289
తెల్ల రేషన్‌ కార్డులు: 6,45,110