మార్కెట్లోకి కొత్తగా Samsung ల్యాప్ ట్యాప్స్ AI ఫీచర్స్ తో

కొందరు టెక్నాలజీని బాగా ఇష్టపడుతూ ఉంటారు. వీరు కంప్యూటరైజ్డ్ వర్క్ చేసేవారైతే మార్కెట్లోకి కొత్తగా ఏ ఆకర్షించే వస్తువు వచ్చినా.. వెంటనే కొనుగోలు చేస్తారు.మరికొందరు తమ అవసరాల కోసం బ్రాండెడ్ వస్తువులను దక్కించుకోవాలని చూస్తుంటారు. ఐటీ రంగానికి చెందిన వారు ఎక్కువగా Laptop యూజ్ చేస్తుంటారు. వీరు అత్యధిక ధరతో పాటు నాణ్యమైన ల్యాప్ టాప్ లను కొనుగోలు చేయాలని అనుకుంటారు. వీరికి అనుగుణంగా ఇప్పటికే ఎన్నో మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే ప్రముఖ బ్రాండ్ Samsung నుంచి లేటేస్ట్ గా మూడు ఆకర్షణీయమైన మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. వీటి ఫీచర్స్, ధర ఎలా ఉందో తెలుసుకుందాం..


ఇప్పటికే Samsung ల్యాప్ టాప్ వాడేవారైతే ఈ కంపెనీకి చెందిన బ్రాండ్ ఎలా ఉంటుందో వారికి అర్థమవుతుంది. అయితే కొత్తగా ల్యాప్ టాప్ తీసుకోవాలని అనుకునేవారు సైతం వీటిపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా Samsung నుంచి Galaxy Book 5 సిరిస్ పేరిట మూడు మోడళ్లను రిలీజ్ చేశారు. వీటిలో ఒకటి Galaxy Book 5 Pro, Galaxy Book 5 Pro 360, Galaxy Book 5 360 .. ఇవి అల్ట్రా ప్రాసెసర్ల ద్వారా శక్తిని పొందుతాయి. ఈ మూడు మోడళ్లు Artificial Intelligence ను కలిగి ఉంటాయి. ఇవి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే అత్యధికంగా 25 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ను అందిస్తాయి. ఎక్కువ సేపు ఛార్జింగ్ కావాలని కోరుకునేవారికి ఇవి అనుగుణంగా ఉంటాయి.

కొత్త ల్యాప్ టాప్ లల్లో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. వీటిలో Intel Core అల్ట్రా 7 సీపీయూ లు ఉన్నాయి. 16 జీబి ప్లస్, 32 జీబీ ర్యామ్ ను పొందుపర్చారు. 256, 512, 1 టబీ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇవి మొత్తం AI ఫీచర్లను కలిగి ున్నాయి. వీటిలో Galaxy Book 5 360 15.6 అంగుళాల హెచ్ డీ ఏమోల్డ్ స్క్రీన్ ను కలిగి ఉండి 60 హెచ్ జడ్ రిప్రెష్ రేటుతో పనిచేస్తుంది. రెండోది Galaxy Book 5 Pro 120 హెచ్ జడ్ రిప్రెష్ మెంట్ తో 14 అంగుళాల డిస్ ప్లేను కలిగి ఉంది.మూడో ల్యాప్ టాప్ Galaxy Book 5 Pro 360120 హెచ్ జడ్ రిప్రెష్ రేట్ ను కలిగి ఉండి 16 అంగుళాల డిస్ ప్లేతో తీసుకోవచ్చు. అయితే ఇవి మార్చి 20 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఈ మోడళ్లలో Galaxy Book 5 360 ని రూ.1,14, 990 గా నిర్ణయించారు. , Galaxy Book 5 Pro ధర రూ.1,31, 990 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే అదనపు ఫీచర్లు కావాలనుకుంటే అధిక ధరను చెల్లించాలి. మూడో మోడల్ Galaxy Book 5 Pro 360 ని రూ.1,55, 990తో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేయాలంటే సమీపంలోని సామ్ సంగ్ సెంటర్లను సంప్రదించవచ్చు. లేదా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చు. కంపెనీకి చెందిన వెబ్ సైట్ www.samsung.com పోర్టల్ లో సంప్రదించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.