‘స్పిరిట్’ నుంచి కొత్త యేడాది తొలి రోజున ఓ లుక్ వస్తుందని ప్రభాస్ అభిమానులకు ముందే తెలుసు. వాళ్లంతా తమ హీరోని సందీప్ రెడ్డి వంగా ఎలా చూపిస్తాడా?
అంటూ ఆత్రుతగా ఎదురు చూశారు. గతంలో సందీప్ రెడ్డి నుంచి వచ్చిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఫస్ట్‌లుక్ పోస్టర్లను, అందులో హీరో తాలుకూ ఇంటెన్సిటీని గుర్తు చేసుకొని.. ఊగిపోయారు. అనుకొన్నట్టుగానే అర్థరాత్రి 12 గంటలకు స్పిరిట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. చూడగానే.. ఫ్యాన్స్ అంతా షాక్. ప్రభాస్ లుక్, సందీప్ తాలుకా ఇంటెన్సిటీకి ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు. ఓ లుక్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా? అన్నట్టుగా ఈ పోస్టర్ ని డిజైన్ చేశాడు వంగా. ఒంటినిండా గాయాలుతో ప్రభాస్, లైటర్ తో సిగరెట్ వెలిగిస్తున్న త్రిప్తి.. ఇదే పోస్టర్ లో కనిపించింది. ప్రభాస్ పొడవైన జుట్టు.. ఆ బాడీ.. ఆ ఫైర్.. ఇదంతా అభిమానులకు పూనకం తెప్పించింది. ప్రభాస్ కటౌట్‌ని సందీప్ సరైన దారిలో వాడబోతున్నాడన్న నమ్మకం ఒక్క లుక్ తో వచ్చేసింది.
చాలామంది అభిమానులు యానిమల్ లో రణబీర్ కపూర్ లుక్ తో పోలుస్తున్నారు. ఆ పోలికలోనూ ఎంతో కొంత వాస్తవం ఉంది. కానీ ఇక్కడున్నది ప్రభాస్. తన స్వాగ్ వేరు. నిజంగానే యానిమల్ సినిమాని ప్రభాస్ తో మరోసారి తీసినా.. అది సూపర్ హిట్టయిపోవడం ఖాయం. సందీప్‌రెడ్డి టేకింగ్ లో, మేకింగ్ లో ఆ మ్యాజిక్ వుంది. అదృష్టవశాత్తూ ఈసారి సందీప్ రెడ్డి యానిమల్ కంటే బలమైన కథతో వస్తున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అది నిజమైన రోజున ప్రభాస్ అభిమానులకు నిజమైన పండగ.
ఫస్ట్ లుక్ పోస్టర్ అంటే.. ఆ సినిమాలోని హీరో స్టిల్స్ లో దిబెస్ట్ బయటపెట్టడం కాదని, పోస్టర్ తోనే ఓ ఇంటెన్సిటీ క్రియేట్ చేయొచ్చని ‘స్పిరిట్’ సందీప్ మరోసారి నిరూపించాడు. ఇక నుంచి ఈ సినిమా నుంచి ఎలాంటి స్టఫ్ బయటకు వచ్చినా.. అది ఇదే రేంజ్‌లో ఉండాలి. ప్రభాస్ అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేసేది అదే.




































