ఆదివారం బడ్జెట్. చరిత్ర సృష్టించబోతున్న నిర్మల సీతారామన్

2026 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ సెషన్ కీలక తేదీలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ సెషన్స్ ఇలా ఉండనున్నాయి.


జనవరి 28న ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం జరగనుంది. అలాగే జనవరి 29న Economic Survey పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. అలాగే ఫిబ్రవరి 1, ఆదివారం కేంద్ర బడ్జెట్ (Union Budget 2026-27) ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం బడ్జెట్ ప్రవేశ పెట్టడం అనేది అరుదైన సంఘటనగా నిపుణులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 1 ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంటులోని లోకసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టబోయే 9వ బడ్జెట్ ఇదే కావడం విశేషం. స్వతంత్ర భారత చరిత్రలో ఇది 88వ కేంద్ర బడ్జెట్ గా గమనించాలి. ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం నిర్మలా సీతారామన్ వరుసగా 9 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి గా చరిత్రలో నిలవనున్నారు.

గతంలో మొరార్జీ దేశాయ్ పది బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఇప్పుడు నిర్మల సీతారామన్ 9 బడ్జెట్లను ప్రవేశపెట్టి ఆయన రికార్డును సమం చేసేందుకు సమీపానికి చేరుకున్నారు. అలాగే గతంలో పీ చిదంబరం 9 బడ్జెట్లు ప్రవేశపెట్టగా, ప్రణబ్ ముఖర్జీ 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారు.

నిజానికి 2017 వరకు ఫిబ్రవరి 28వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆనవాయితీ అరుణ్ జైట్లీ హయాంలో మార్పు చెందింది. అప్పటినుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే బడ్జెట్ అమలు చేయడానికి మార్పులు చేశారు. 2025 సంవత్సరంలో బడ్జెట్ శనివారం ప్రవేశపెట్టారు. అయితే 2026 బడ్జెట్ మాత్రం ఆదివారం ప్రవేశపెట్టడం ఒక అరుదైన ఘటనగా చెప్పవచ్చు. ఇక ఈ బడ్జెట్ కు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకున్నట్లయితే, 2019 సంవత్సరం నుంచి భారతదేశపు పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. 2024 లో మోడీ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు జరిగిన తర్వాత కూడా ఆమెనే ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు.

ఈ సంవత్సరం పెట్టబోయే బడ్జెట్ పైన అనేక రంగాలు ఆశలు పెట్టుకుంటాయి. ముఖ్యంగా తయారీ రంగం ఎక్కువగా ఈ బడ్జెట్ పైన ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే అమెరికా విధించిన టారిఫ్ ఫలితంగా తయారీ రంగం ఎక్కువగా ప్రభావం చెందింది. ఎగుమతులు తగ్గుతున్న నేపథ్యంలో మరిన్ని ప్రోత్సాహకాలు లభించాలని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.