No jobs for Indian Students in USA | తెలంగాణ మేడ్చల్‌కు చెందిన Syeda Minhaj Zaidi(సయ్యదా మిన్ హజ్ జైదీ) అనే అమ్మాయి.. అమెరికాలో చదువుకొని అక్కడే స్థిరపడాలని వెళ్లింది.
కానీ రెండు నెలలుగా జైదీ ఇంటికి ఫోన్ చేయలేదు. ఆమె ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. చివరికి రెండు నెలల తరువాత దీన స్థితిలో కనిపించింది. ఆమె వద్ద ఉన్న డబ్బులు అక్కడ దొంగలు కాజేశారు. ఉద్యోగం లేదు. ఇల్లు లేదు. డిప్రెషన్‌తో బాధపడుతూ.. చివరికి పిచ్చిదానిలా రోడ్లపై ఉంటోంది. ఇప్పుడామె వీడియో వైరల్ కావడంతో.. ఇండియాలో ఉన్న జైదీ తల్లిదండ్రులకు ఆమె గురించి తెలిసి.. వాళ్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తమ కూతురిని ఎలాగైనా ఇండియా తీసుకురావాలని..
ఇలాంటిదే మరో కేస్ చూద్దాం..
ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు విదేశాల్లో చదువుకోవాలని మార్చి 2023లో అమెరికాకు వెళ్లాడు. అమెరికాలో అతని బావకు ఒక సాఫ్టవేర్ కంపెనీ ఉంది. కానీ అక్కడికి వెళ్లాక అతని బావ ఇంట్లో పనిమనిషిలా మారిపోయాడు. బావ ఇంట్లో పని అంతా అయిపోయాక.. అతని బావ స్నేహితుల ఇళ్లలో కూడా ఇంటి పని చేసేందుకు వెళ్లేవాడు. రోజుకు మూడు ఇళ్లలో 18 గంటలు పనిచేసేవాడు. తినడానికి సరిగా తిండి లేదు, ఉండేందుకు ఒక గది కూడా లేదు.
చెప్పిన పని చేయకపోతే.. అతని బావ, బావ స్నేహితులిద్దరూ కలిసి.. pvc పైపులతో, వైర్లతో కొట్టేవారు. కంటి నిద్రలేక, తినడానికి సరిగా తిండి లేక బాగా బలహీనమైనపోయాడు. అతని పరిస్థితి చూసి పక్కింటి వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ యువకుడిని కాపాడారు. ఆ యువకుడి బావ, మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అమెరికాకు చదువుకోసం వెళ్లి అక్కడ నరకం అనుభవిస్తున్న ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు.
కేవలం 2023లో విదేశాలకు చదువుకునేందుకు వెళ్లిన Indian students సంఖ్య 13 లక్షలు. వీరిలో 65% America, Canada, UK, Australia దేశాలకు వెళ్లారు.
America – 2.5 lakhs
Canada – 3 lakhs
UK — 1 Lakh 30 Thousand
Australia — 80 Thousand Indian students వెళ్లారు. 2021లో పోల్చితే 68% ఎక్కువ Indian students 2023లో abroad వెళినట్లు తెలిసింది.
ఈ 13 lakhsలో every student సగటున ప్రతి ఏడాది రూ.32 లక్షలు చేస్తున్నట్లు report. అయితే ఇంత డబ్బు ఖర్చు చేసినా.. చాలా మంది students.. foreignలో సంతోషంగా లేరు. మరి లక్షల రూపాయలు ధారపోసినా.. Indian students విదేశాల్లో సంతోషంగా లేకుంటే.. ఆ దేశాలకు ఎందుకు వెళుతున్నట్లు?. అది కూడా Indian స్టూడెంట్స్ పైన violent attacks జరుగుతున్నట్లు మనం రోజూ వింటూనే ఉన్నాం. గత మూడు నెలల్లో ఒక్క అమెరికాలోనే 10 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఈ హింసాత్మక ఘటనల్లో చనిపోయారు.
మరోవైపు కొందరు స్టూడెంట్స్ మాత్రం తమ కెరీర్ ఫారిన్ దేశాలలో చాలా బాగుందని చెబుతున్నారు. మరి ఇందులో ఏది నిజం? లేకపోతే ఇవి రెండు నిజమేనా?.. ఇటీవల ఇండియాలో .. చాలామంది entrepreneurs తమ success stories social mediaలో షేర్ చేస్తున్న ఈ సమయంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాలు చదువుకోవడానికి వెళ్లడం కర్టేనా?
65% Indian students America, Canada, UK, Australia దేశాలకు వెళ్లారు. మిగతా 35% ఏ దేశాలకు వెళ్లారో చూద్దాం. Indian Ministry of Foreign affairs report ప్రకారం.. 2022లో 14000 Indian students Krygyzstanలో, 6000 మంది ఇటలీలో, 9300 మంది బంగ్లాదేశ్‌లో, 2239 తైవాన్‌లో, 93 మంది వెనెజులాలో చదువుకునేందుకు వెళ్లారు. ఈ దేశాలకు వెళ్లిన వారు mostly MBBS degree కోసమే వెళ్లారు.
విదేశాలకు వెళ్లే వారిలో అత్యధికంగా అంటే 38% కేవలం ఈ నాలుగు రాష్ట్రాల నుంచే వెళుతున్నారు. Punjab, Maharashtra, Telangana, Andhra Pradesh. అలాగే జనాభా తక్కువ ఉన్నా.. percentage ప్రకారం చూసుకుంటే.. Goa, kerela నుంచి కూడా భారీ సంఖ్యలో వెళుతున్నారు. ఈ సంఖ్య మరో రెండు సంవత్సరాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.
అసలు ఇండియా నుంచి students ఎందుకు విదేశాలు వెళుతున్నారు? మన దేశంలో Universities, Colleges ఉన్నాయి కదా?.. ఈ అంశాన్ని పరిశీలిద్దాం.
ఇండియాలో మొత్తం 1200 Universities, 49400 colleges ఉన్నాయి. మరి ఇన్ని education institutions ఉన్నప్పటికీ.. Indian students ఎందుకు విదేశాలు వెళుతున్నారో.. కారణాలు చూద్దాం.
1. ప్రవేశ పరీక్షల్లో పోటీ నుంచి తప్పించుకోవడానికి
Indiaలో ఒక మంచి కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే అంత easy కాదు. ప్రతి entrance examలో heavy competition ఉంటుంది. ఈ entrance examలో పాస్ కావడం.. ఒక tournament గెలవడం లాంటింది. For example 2023లో కేవలం లక్ష 40 వేల మెడికల్, డెంటల్ సీట్ల కోసం 20 లక్షల మంది NEET UG EXAM రాశారు. అంటే ONLY 7% ADMISSION RATE.
అదే 11 లక్షల మంది JEE MAINS రాశారు. 23 IITs 17000 seats కోసం 11 లక్షల మంది EXAM రాస్తే.. కేవలం 4% మందికే సీట్లు దక్కుతాయి.
అలాగే UPSC Prelims 10 లక్షల మంది రాస్తే.. rank listలో qualify అయ్యేది 1000 మంది మాత్రమే.
ఈ entrance examsలో pass అయ్యేవాళ్లకి మన సమాజంలో మంచి విలువ ఉంటుంది. IIT Graduate అంటే చాలు అదొక బ్రాండ్. ఏ కంపెనీలో వెళ్లినా.. మిగతా వారికంటే ముందు IIT Graduatesకి easyగా job లభిస్తుంది. ఒక్క జాబ్ ఏంటి? పెళ్లి సంబంధాలు కూడా క్యూ కడతాయి.
మీకు తెలుసా? IIT, IIM Graduates కోసం ప్రత్యేక matrimony website ఉందని?.. అదే IITIIMShaadi.com
ఈ websiteకు బ్రాండ్ అంబాసిడర్, మరెవరో కాదు.. ప్రముఖ పెళ్లికాని సినిమా ప్రొడ్యూసర్ కరణ్ జోహర్. ఇంతకీ IIT, IIM Graduates చాలా తెలివికల వాళ్లని అందరూ అనుకుంటుంటే.. వాళ్ల కంటే తెలివికల వాడు..ఈ IITIIMShaadi.com website రూపకర్త.. Taksh Gupta. ఎందుకంటే ఈయన మాత్రం IIT Graduate కాకుండానే.. భలే బిజినెస్ పెట్టేశాడు.
సరే ఇక విషయానికి వస్తాం.. ఈ IIT, IIM, JEE MAINS, NEET లాంటి entrance examsలో fail అయిన వాళ్లు.. దేశంలోని చిన్న చిన్న కాలేజీలలో అడ్మిషన్ తీసుకుంటారు. కానీ ఈ చిన్న కాలేజీల పరిస్థితి దారుణంగా ఉంది. for example.. ఈ చిన్న కాలేజీలలో చదువుకునే వాళ్లలో చాలామందికి అంటు 80 శాతం మందికి ఒక ఈ మెయిల్ కూడా చేయడం రాదని ఒక సర్వేలో తేలింది. అలాగే బిజినెస్ స్కూల్స్‌లో చదువుకునే వాళ్లలో కేవలం 7 శాతం మంది మాత్రమే ఉద్యోగానికి అర్హులని కంపెనీలు చెబుతున్నాయి.
Artificial Intelligence రాజ్యమేలుతున్న ఈ కాలంలో దేశంలోని యువత.. ఈ మెయిల్ సెండ్ చేయడం కూడా రావడం లేదంటే.. దానికి మన దేశంలోని కాలేజీ విద్యా వ్యవస్థే కారణమని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. బి కాం చదువుకునే students.. degree పొందాక వాళ్లకు జాబ్స్ రావడం లేదు. వాళ్లు మళ్లీ CA లేదా MBA చేయాల్సి వస్తోంది.
ఇక ఇంజినీరింగ్ కాలేజీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇంకా చాలా ఇంజినీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ గురించి నేర్పించే ముందు FLOPPY DISK, PRINTER, KEYBOARD INTRODUCTION CLASSES చెబుతున్నారు.
అందుకే ఈ విషయంలో IIT Rourkee professor. Prem Vrat మాట్లాడుతూ.. దేశంలో కొత్త కొత్త కాలేజీలు పుట్టుకొస్తున్నాయి కానీ.. ఆ కాలేజీల్లో పెద్ద పెద్ద buildings మాత్రమే ఉన్నాయని.. వాటిలో మంచి కురికులం(Curriculum), మంచి టీచర్స్ లేరని చెప్పారు.
అలాగే కాలేజీలను నియంత్రించే regulatory body AICTE ప్రకారం.. కాలేజీల్లో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉండాలి.. కానీ మన దేశంలో AVERAGE చూస్తే.. ప్రతి 28 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఈ RATIO.. 68:1, 81:1 ఉంది. నిజానికి దేశంలోని ఈ కొత్త కొత్త కాలేజీలన్నీ ఒక రియల్ ఎస్టేట్ రాకెట్ లా పనిచేస్తున్నాయని.. వీటిని రాజకీయ నాయకులు, BUILDERS నడపుతున్నారని IIM PROFESSOR V RAGAUNATHAN అన్నారు.
ఉదాహరణకు బిజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ సింగ్.. అదే మహిళా రెజ్లర్లపై లైంగిక దాడి వివాదంతో దేశమంతా బాగా ఫేమస్ అయిన ఈయనకు ఏకంగా 54 కాలేజీలున్నాయి. ఒక కాలేజీకి స్థాపించడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాలంటే చాలా కష్టం.. కానీ రాజకీయ నాయకులు మాత్రం కాలేజీలు ఈజీగా స్థాపించేస్తారు. కానీ ఈ కాలేజల్లో చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని నమ్ముకోవడం మూర్ఖత్వమే అవుతంది.
అందుకే దేశంలో విద్యార్థులకు రెండే దారులు.. ఒకటి. IIT, IIM, ENTRANCE EXAMSలో QUALIFY కావాలి లేదా.. ఇలాంటి ఉపయోగం లేని చిన్న కాలేజీల్లో కేవలం డిగ్రీల కోసం చేరాలి.
ఈ రెండూ కాదని విదేశాల్లో చదవుకుందాం అంటే లక్షలు కోట్లు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టే స్థోమత అందరికీ ఉండదు.
2.ఉన్నత చదువులపై రాబడి
ఆర్థికంగా స్థోమత ఉన్నవాళ్లు విదేశాల్లో తమ పిల్లలు చదువుకుంటే మంచి సాలరీతో అక్కడే స్థిరపడవచ్చని భావించి.. డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లి జాబ్ చేస్తే.. కనీసం 120 రెట్లు ఎక్కువ సంపాదించవచ్చు అని వాదిస్తున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. అలాగే యువత కూడా కేవలం డబ్బులే కాదు. ఆ దేశాల్లోway of living చాలా బాగుంటుందని.. అక్కడి ప్రజలు చాలా నీట్‌గా ఉంటారని… అలాగే అమెరికా లాంటి capitalist దేశాల్లో కష్టపడి పనిచేసేవాళ్లకు, టాలెంట్ ఉన్నవాళ్లకు తగిన గుర్తింపు లభిస్తుందని చెబుతున్నారు.
ఇండియాలో ఒక PH.D చేసే విద్యార్థి తమ థీసిస్ పేపర్ PUBLISH చేసేందుకు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి ఉంటుంది. లేదా PUBLISH చేసేందుకు కొందరు అవినీతి పరులైన PROFESSORలకు డబ్బులివ్వాలి.
3. విదేశాల్లో జీవన ప్రమాణాలు
మన దేశంతో Compare చేస్తే అమెరికా లాంటి విదేశాలలో మంచి QUALITY OF LIFE ఉంటుంది. ఉదాహరణకు భారత నగరాల్లో Air pollution తీసుకుందాం. ఇండియా రాజధాని ఢిల్లీలో నివసించే వారు Air pollution కారణంగా సగటున 5 నుంచి 12 సంవత్సరాలు తక్కువ జీవిస్తారని ఒక స్టడీలో బయటపడింది.
కానీ అమెరికాలో అలా ఉండదు. పైగా అక్కడ Infrastructure చాలా బాగుంటుంది. అమెరికాలో footpathని కేవలం ప్రజలు నడవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అదే ఇండియాలో అయితే.. footpathలపై తోపుడు బండ్లు, చాయ్ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు ఆక్రమించేసుకుంటాయి.
ఇక నాలుగో ప్రధాన కారణం
4. సమాజంలో స్టేటస్
అబ్బాయి అమెరికాలో వెళ్లి చదువుతున్నాడు.. జాబ్ చేస్తున్నాడు అంటే పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ కట్నం డిమాండ్ చేస్తున్నారు. లేదా అమ్మాయి అమెరికాలో ఉందంటే కట్నం పెద్దగా అడగరు. పంజాబ్‌లో అయితే.. అమ్మాయి విదేశాల్లో ఉందంటే చాలు.. ఎదురు కట్నం ఇస్తున్నారు. ఎందుకంటే.. అమ్మాయిని పెళ్లిచేసుకుంటే అబ్బాయి కూడా spouse visaపై అమెరికా వెళ్లిపోవచ్చని ఆశ..
So ఇలాంటి ఎన్నో ఆశలు, కలలు కంటూ Indian students foreign వెళుతున్నారు. మరి అందరి కలలు నిజమవుతున్నాయా? అంటే లేదు అనే చెప్పాలి.
ఎందుకంటే ఈ so called developed countriesలో గత కొన్ని సంవత్సరాలుగా economy growth లేదు. అందుకే.. అక్కడ ఓ మంచి జాబ్ దొరకడం కష్టంగా మారింది. అందుకే తెలంగాణకు చెందిన సయ్యదా జైదీ అనే యువతి తన MS Degree పూర్తి చేయడానికి 2021లో అమెరికాలోని డెట్రాయిట్ వెళ్లింది. కానీ 2023 జులైలో చికాగోలో రోడ్లపై దయనీయ స్థితిలో కనిపించింది. ఆమె మతిస్థిమితం కూడా కోల్పోయింది.
అమెరికా, కెనెడా, యు కె లాంటి developed countriesలో ఆర్థిక మాంద్యం ఛాయలు కనిపిస్తున్నాయి. యూకె, జపాన్ దేశాలు అధికారికంగా recession ఉన్నట్లు ప్రకటించాయి.
చాలామంది students విదేశాల్లో చదువుకుంటూ part time jobs చేస్తూ.. తమ ఖర్చులకు అవసరమయ్యే డబ్బులు సంపాదించుకుంటుంటారు. కానీ ఇప్పుడు ఆ పార్ట్ టైమ్ జాబ్స్ కూడా దొరకడం లేదు.
వికాస్ అనే ఓ ఇండియన్ స్టూడెంట్ కెనెడాలో computer science masters చేశారు. cloud computing course కూడా పూర్తి చేసి ఆరు నెలల పాటు జాబ్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. పైగా అక్కడ ఖర్చులు భరించలేక ఒక సూపర్ మార్కెట్లో పని చేసేవాడు. కానీ ఆ జాబ్‌తో వచ్చే డబ్బులు ఇంటి రెంట్, ఫుడ్ కోసం సరిపోయేవి కాదు. దీంతో వికాస్ ఇండియా తిరిగి వచ్చేశాడు.
బెంగుళూరుకు చెందిన Shanti అనే అమ్మాయి కూడా cloud computing చేసి.. జాబ్ దొరకకపోవడంతో ఒక restaurantలో 30 జాబ్ vacancies చూసి.. interview కోసం వెళ్లింది. కానీ అక్కడ ఆ 30 vacancies కోసం 550 మంది లైన్లో నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. కొంతమంది students అయితే తమకు unpaid internship కూడా దొరకలేదని చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రవి అనే యువకుడు 40 లక్షలు ఖర్చు చేసి Australia వెళ్లాడు. 40 లక్షల్లో 14 లక్షలు ఏజెంట్‌కు ఇచ్చాడు. కానీ Australia వెళ్లి ఏడాదిపాటు జాబ్ కోసం వెతికి వెతికి ఫలితం లేక తిరిగి ఇండియా వచ్చేశాడు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించిదని.. అందుకే బిజినెస్ తగ్గిపోయి.. ఆదాయం లేకపోవడంతో ఖర్చులు తగ్గించే దిశగా ప్రయత్నిస్తున్నామని అమెరికాలో చాలా కంపెనీలు ప్రకటించాయి. ఖర్చులు తగ్గించే దిశగా.. ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
అమెరికాలో 2023 సంవత్సరంలో దిగ్గజ టెక్ కంపెనీలు.. అమెజాన్, Google, Meta, Discord, Twitch, Paypal, Citi, Nike.. 2 లక్షల మంది ఉద్యోగం నుంచి తొలగించేశాయి. అందులో 40% భారతీయులు ఉండడం గమనించాల్సిన విషయం. అలాగే 2024 అంటే Just 2 నెలల్లోనే ఈ కంపెనీలు ఇప్పటికే 7500 మందిని Layoff చేశాయి.
ఈ పరిస్థితి రావడానికి ఒక ముఖ్య కారణం బ్యాంకు వడ్డే రేట్లు. 2021లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన Federal Reserve System Bank వడ్డీ రేట్లను దాదాపు Zero చేసింది. అంటే వడ్డీ లేకుండా అప్పుదొరకుతోంది. దీంతో కంపెనీలు ఎడాపెడా అప్పులు చేసి.. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ start చేశాయి. ఈ క్రమంలోనే Over Hiring చేసుకున్నాయి. కానీ ఈ రోజు Interest rates 5.5% ఉన్నాయి. అందుకే ఆదాయం లేని సమయంలో తీసుకున్న లోన్స్‌కు వడ్డీలు చెల్లించడం భారంగా మారడంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి Layoffs చేస్తున్నాయి. America, Canada, UKలో JOB MARKET పతనం కావడంతో పాటు INFLATION కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఉద్యోగాలు పోయి ఆదాయం లేక ఇబ్బంది పడుతుంటే INFLATION దెబ్బకు నిత్యావసరాలు కూడా జేబులో డబ్బులు లేని పరిస్థితి.
మరోవైపు ఒక ఇండియన్.. అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలంటే.. average 195 years wait చేయాలని ఒక అమెరికన్ సెనేటర్ తెలిపారు. అంటే గ్రీన్ కార్డు రాకముందే ఆ వ్యక్తి ఆయుషు తీరిపోతుంది. అలాగే H1-B visa tough rulesతో ఇండియన్స్ కష్టాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అడ్డదారుల్లో H1-B visa పొందాలని ప్రయత్నించే ఇండియన్స్ ఏజెంట్లను నమ్మి భారీగా మోసపోతున్న కేసులెన్నో.
Indian Students face చేసే మరో పెద్ద problem. పనికిరాని డిగ్రీలు. అవును చాలామంది విద్యార్థులు ఇండియా నుంచి వెళ్లి అమెరికా, బ్రిటన్, కెనెడా దేశాల్లో అక్కడ ఏది పడితే ఆ యూనివర్సిటీలు, కాలేజీల్లో చేరి కోర్సులు చేస్తున్నారు. తీరా ఉద్యోగం కోసం Interviewకి వెళితే.. ఆ యూనివర్సిటీ డిగ్రీకి value లేదని తెలిసింది. ఈ విషయం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ స్వయంగా అంగీకరించారు. చాలామంది విద్యార్థులు ఇతర దేశాల నుంచి వచ్చి.. తమ దేశంలో ఉపయోగం లేని కోర్సులు చేస్తున్నారని.. వాటి వల్ల ఎలాంటి ఉద్యోగాలు రావని ఆయన అన్నారు.
యుకెలో International students కోసం.. UK Job portal నడుపుతున్న Tripthi Maheshwari మాట్లాడుతూ.. యుకెలోని చాలా యూనివర్సిటీలు తమ కోర్సులు చేస్తే.. పెద్ద ఉద్యోగాలు వస్తాయని advertisements ఇస్తున్నాయని.. వాటిని నమ్మి చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీల్లో చేరుతున్నాయని చెప్పారు. ఆ డిగ్రీల వల్ల ఉద్యోగాలు రావని ఆమె తెలిపారు.
కెనెడాలో Tier 2, Tier 3 కేటగిరీ యూనివర్సిటీ నుంచి sports business management డిగ్రీ చేసిన Shreyas యూకె వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే.. తన డిగ్రీకి ఎటువంటి value లేదని తెలిసిందని.. ఇది ఒకరకంగా మోసమేనని Shreyas అన్నాడు.
Western countriesలో ఇదంతా జరుగుతుంటే ఇండియా మాత్రం fastest growing economyగా ఎదుగుతోంది. గత సంవత్సరం apple company ఇండియాలో 1 crore iphones sale చేసింది. అలాగే luxury car companies కూడా రికార్డ్ సేల్స్ చేశాయి. అందుకే చాలా అమెరికన్ కంపెనీలు చైనాలో కాకుండా ఇండియాలో Investment చేస్తున్నాయి.
ఇప్పుడు చెప్పినదంతా అందరికీ వర్తించదు. కొందరు విదేశాల్లో మంచి జాబ్‌తో సెటిల్ అయి సంతోషంగా ఉన్నారు. కానీ ఈ పరిస్థితి కొందరిదే.. అందుకే విదేశీ మాయలో పడి అక్కడికి వెళ్లే ముందు ఇప్పుడు చెప్పిన సమస్యలన్నింటి గురించి జాగ్రత్తగా తెలుసుకుంటే బెటర్.