ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర… 20 మంది ఛైర్మన్లతో తొలి జాబితా విడుదల

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల జాతర ప్రారంభమైంది. 20మందితో తొలి జాబితా విడుదలైంది. ఎన్డీఏ కూటమి పార్టీలలో పదవులు దక్కిన వారిలో లో 16మంది టీడీపీ నాయకులు, ముగ్గురు జనసేన, ఒక బీజేపీ నాయకుడు ఉన్నారు.

ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రారంభమైంది. నాలుగు నెలలుగా ఊరిస్తున్న పదవుల భర్తీ ఎట్టకేలకు చేపట్టారు. 20మంది ఛైర్మన్లతో తొలిజాబితా విడుదల చేశారు. సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ పదవుల్ని భర్తీ చేశారు.

మొత్తం 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల జాబితాను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ లకు పెద్ద పీట వేశారు. 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు దక్కాయి. ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి దక్కింది. 6 గురు యూనిట్ ఇంఛార్జ్ లకు పదవులు దక్కాయి.

20 కార్పొరేషన్లకు ఛైర్మెన్లను నియమించారు, ఒక కార్పొరేషన్ కు వైస్ ఛైర్మెన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను ప్రకటించారు. ప్రకటించిన 99 పదవుల్లో యువత కు ప్రాధాన్యం ఇచ్చారు.

పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పదవులు కట్టబెట్టిన కట్టబెట్టారు. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి హై ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం పదవుల్లో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీ1 పదవి కేటాయించారు.
ఛైర్మన్లను నియమించిన కార్పొరేషన్లు ఇవే..

1 వక్ఫ్ బోర్డు – అబ్దుల్ అజీజ్

2 స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) – అనిమిని రవినాయుడు

3 AP హౌసింగ్ బోర్డ్ – బత్తుల తాత్యబాబు

4 AP షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR) – బొరగం శ్రీనివాసులు
5 AP మారిటైమ్ బోర్డ్ – దామచర్ల సత్య

6 SEEDAP (APలో ఉపాధి కల్పన & ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ కోసం సొసైటీ) – దీపక్ రెడ్డి

7.20 పాయింట్ ఫార్ములా – లంకా దినకర్ (బీజేపీ)

8. AP మార్క్‌ఫెడ్ – కర్రోతు బంగార్రాజు

9 AP స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – మన్నె సుబ్బారెడ్డి

10 ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APIIC – మంతెన రామరాజు

11 AP పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ – నందం అబద్దయ్య

12 AP టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – నూకసాని బాలాజీ

13 APSRTC-చైర్మన్, APSRTC వైస్ చైర్మన్ – కొనకళ్ల నారాయణ, పిఎస్‌ మునిరత్నం

14 AP అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – పీలా గోవింద సత్యనారాయణ

15 లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – పిల్లి మాణిక్యాల రావు

16 AP రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి – పీతల సుజాత

17 A.P. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSME DC) – తమ్మిరెడ్డి శివశంకర్(జనసేన)

18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ – తోట మెహర్‌ సుధీర్‌( జనసేన)

19 ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTPC) వజ్జా బాబురావు

20 AP టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ APTIDCO – వేములపాటి అజయ్‌కుమార్‌ (జనసేన)