ఐఫోన్ కు గట్టి పోటీని ఇస్తున్న నథింగ్ తాజా ఫోన్.. ధరకు సంబంధించి కీలక ప్రకటన

భారతదేశంలోని స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా బడ్జెట్ ఫోన్స్‌తో పాటు అధునాత ఫీచర్స్‌తో వచ్చే ప్రీమియం ఫోన్ల కొనుగోలుకు కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు ఐఫోన్‌కు ధీటుగా ఉండేలా కొత్త ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నారు. తాజాగా నథింగ్ కంపెనీ నథింగ్-3 పేరుతో ఐఫోన్‌కు గట్టిపోటీనిచ్చేలా ఓ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో నథింగ్-3 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

నథింగ్ ఫోన్-3 స్మార్ట్ ఫోన్ గురించి చాలా రోజులుగా చాలా వార్తలు హల్‌చల్ చేస్తున్నారు. అయితే ఇటీవల నథింగ్ కంపెనీ తన రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం అధికారిక లాంచ్ ఈవెంట్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో నథింగ్ ఫోన-3 మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 2025లో భారతదేశంలో లాంచ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని నథింగ్ కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. నథింగ్ సీఈఓ కార్ల్ పీ ఇటీవల సోషల్ మీడియాలో రాబోయే ఫోన్‌ను టీజ్ చేయడంతో పాటు ధరల గురించి పేర్కొన్నారు. త్వరలో రిలీజ్ కాబోయే నథింగ్ ఫోన్ (3) ప్రీమియం డిజైన్, మెరుగైన పనితీరు, అధునాతన సాఫ్ట్‌వేర్ ఫీచర్లను కలిగి ఉంటుందని నథింగ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు కార్ల్ పీ ధ్రువీకరించారు. అధికారిక స్పెసిఫికేషన్లు ఇంకా విడుదల కానప్పటికీ లీకు వీరులు మాత్రం నథింగ్ ఫోన్-3 ఫీచర్లు ఇవేనంటూ కొన్ని స్పెసిఫికేషన్లు పేర్కొంటు.


నథింగ్ ఫోన్ (3) క్వాల్కమ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని భావిస్తున్నారు.  ఈ ఫోన్ ఇది స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 4 లేదా స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 4 ద్వారా పని చేస్తుందని పేర్కొంటు. గతల నథింగ్ ఫోన్ (2) (దీనిలో ఎస్‌డీ 8 ప్లస్ జనరేషన్ 1 ఉంది) కంటే చాలా మెరుగైన ఫోన్ అవుతుంది. నథింగ్ ఫోన్-3లో కెమెరా విభాగంలో పెద్ద మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం నథింగ్ ఫోన్ (3) ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో పెద్ద ప్రైమరీ సెన్సార్‌తో పాటు పెరిస్కోప్-శైలి టెలిఫోటో లెన్స్ ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. . ఇది మొట్టమొదటి ఫర్ నథింగ్ అవుతుంది, ఇది ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మెరుగ్గా పోటీ పడటానికి వీలు కల్పిస్తుంది.

నథింగ్ ఫోన్-3లో  5,000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఫోన్ మెరుగైన బ్యాకప్‌ను అందిస్తుంది. ధర పరంగా ప్రపంచ మార్కెట్లో దీని ధర దాదాపు 800 యూరోలు (దాదాపు రూ. 90,500) ఉండవచ్చని కార్ల్ పీ సూచించాడు. అయితే, దీనిని భారతదేశంలో రూ. 55,000 మరియు రూ. 65,000 మధ్య ప్రారంభించే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఫోన్ గూగుల్ పిక్సెల్ 9ఏ, ఐఫోన్ 16ఈ, వన్ ప్లస్ 13 వంటి ఫోన్స్‌కు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.