ఏపీ మద్యం కేసు(AP liquor Case)లో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఒక్కొక్కరి ప్రమేయంపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Former MP Vijayasai Reddy)కి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే విజయసాయిని ఓ సారి విచారించారు. మరోసారి కూడా విచారిస్తామని ఆ సమయంలోనే విజయసాయిరెడ్డికి తెలిపారు.
అయితే తాజాగా జారీ నోటీసుల్లో ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. లిక్కర్ స్కాం కేసులో సాక్ష్యం చెప్పాలని తెలిపారు. ఏప్రిల్ 18న తొలిసారి విచారణకు హాజరైన సమయంలో లిక్కర్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి(Kc Reddy Rajasekhar Reddy) పాత్రతో పాటు మిగిలిన నిందితుల వివరాలను కూడా సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి వివరించారు. అయితే అనూహ్యంగా మరోసారి విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.
































