నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (PDIL).. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీడీఐఎల్ కార్యాలయాలు/ ప్రాజెక్ట్ సైట్‌లో పలు విభాగాల్లో 57 ఇంజినీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.pdilin.com/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు : 57
డిప్లొమా ఇంజినీర్ పోస్టులు: 04
డిగ్రీ ఇంజినీర్ పోస్టులు: 53
ఇతర ముఖ్యమైన సమాచారం :
విభాగాలు: ఫైర్/ఇండస్ట్రియల్ సేఫ్టీ, సివిల్ (కన్‌స్ట్రక్షన్), ఎలక్ట్రికల్ (కన్‌స్ట్రక్షన్), ఇన్‌స్పెక్షన్ (ఎలక్ట్రికల్), ఇన్‌స్పెక్షన్ (సివిల్), ఇన్‌స్పెక్షన్ (మెకానికల్), ఇన్‌స్ట్రుమెంటేషన్ (కన్‌స్ట్రక్షన్), మెకానికల్ (కన్‌స్ట్రక్షన్), మెకానికల్ (మెషినరీ) విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్ (సైన్స్ సబ్జెక్టులు), ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400 చెల్లించాలి.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్
PDIL-Engineer-28-08-2024
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 11, 2024
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహిస్తారు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ వేదిక: పీడీఐఎల్ భవన్, నోయిడా.
Government Jobs 2024 : ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌లో 391 ఉద్యోగాలు
GAIL Non Executive Recruitment 2024 : న్యూఢిల్లీలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL).. భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ (GAIL) వర్క్ సెంటర్లు/ యూనిట్‌లలో పలు విభాగాల్లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో 391 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై.. కొనసాగుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 7వ తేదీ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.