దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ RBI బ్రాంచుల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 17, 2025వ తేదీ వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 17, 2025వ తేదీ వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 120 గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
పోస్టుల వివరాలు
- గ్రేడ్ బీ ఆఫీసర్స్ (DR) – జనరల్ పోస్టుల సంఖ్య: 83
- గ్రేడ్ బీ ఆఫీసర్స్ (DR) – డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ (DEPF) పోస్టుల సంఖ్య: 17
- గ్రేడ్ బీ ఆఫీసర్స్ (DR) – డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ (DSIM) పోస్టుల సంఖ్య: 20
- జనరల్ స్ట్రీమ్ పోస్టులకు కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ (SC/ST/PwBDలకు 50%) లేదా 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (SC/ST/PwBDలకు ఉత్తీర్ణత) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. CA ఫైనల్ లేదా తత్సమాన ప్రభుత్వ గుర్తింపు పొందిన సాంకేతిక డిగ్రీలు వంటి వృత్తిపరమైన అర్హతలు కలిగిన వారు కూడా అర్హులు.
- DEPR స్ట్రీమ్ పోస్టులకు కనీసం 55% మార్కులతో ఎకనామిక్స్, ఫైనాన్స్, ఎకనామెట్రిక్స్ లేదా సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. PGDM/MBA (ఫైనాన్స్) లేదా పరిశోధన/బోధన అనుభవం ఉండాలి.
- DSIM స్ట్రీమ్ పోస్టులకు కనీసం 55% మార్కులతో స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్ లేదా సంబంధిత విభాగంలో మాస్టర్స్ చేసి ఉండాలి. ISI, PGDBA (ISI కోల్‌కతా/IIT ఖరగ్‌పూర్/IIM కలకత్తా) నుంచి M.Stat. లేదా సంబంధిత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు చేసిన వారు కూడా అర్హులే. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా జూలై 1, 2025 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంఫిల్ లేదా పీహెచ్‌డీ అర్హతలు కలిగిన అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి వరుసగా 32, 34 సంవత్సరాలకు పొడిగించబడింది.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 30, 2025వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ. 850, SC/ST/PwBD అభ్యర్ధులు రూ. 100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్షల షెడ్యూల్ ఇదే..
- ఫేజ్-I ఆన్‌లైన్ పరీక్ష గ్రేడ్ ‘బి’ (డిఆర్) – జనరల్ పరీక్ష: అక్టోబర్ 18
- ఫేజ్-I ఆన్‌లైన్ పరీక్ష గ్రేడ్ ‘బి’ (DR) – DEPR (పేపర్ 1 & 2), DSIM (పేపర్-1) పరీక్ష: అక్టోబర్ 19
- గ్రేడ్ ‘బి’ (డిఆర్) కోసం దశ-II ఆన్‌లైన్ పరీక్ష – జనరల్ పరీక్ష: డిసెంబర్ 06
- ఫేజ్-II ఆన్‌లైన్/రాత పరీక్ష గ్రేడ్ ‘B’ (DR) -DEPR (పేపర్-1 & 2) /DSIM (పేపర్-2 & 3) పరీక్ష: డిసెంబర్ 06
































