శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నవంబర్ కోటా దర్శనం టికెట్లు విడుదల

www.mannamweb.com


తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్.. నవంబర్ కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈరోజు అంటే ఆగస్ట్ 23న అంగప్రదక్షిణ, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు, వయోవృద్ధులకు టికెట్లను రిలీజ్ చేస్తోంది. వీటితో పాటుగా శనివారం(ఆగస్ట్ 24)న రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను, తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ సూచించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

తిరుమల శ్రీ వేకంటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నవంబర్ నెల కొటాకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. నవంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షణ కోటా టికెట్లను ఇవాళ(ఆగస్ట్ 23) ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. అలాగే ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లను, మధ్యాహ్నాం 3 గంటలకు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనుంది.

ఈ టికెట్లతో పాటుగా నవంబర్ నెల కోటా రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆగస్ట్ 24(శనివారం) ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో నవంబరు నెల గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇక ఆగష్టు 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాల‌ని టీటీడీ భక్తులకు సూచించింది.