ఇక వార్షిక ఫాస్టాగ్‌

సొంత వాహనదారుల టోల్‌ప్లాజా కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీతో ముందుకొచ్చింది. జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వ్యక్తిగత వాహనదారుల ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


గరిష్టంగా 200 ట్రిప్పులకు అనుమతిస్తూ వార్షిక ఫాస్టాగ్‌ ఆఫర్‌ను ఈ నెల 15 నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి రానుంది. రూ.3 వేలు చెల్లింపుతో ప్రత్యే క టోల్‌ పాస్‌ను ఎవరైనా వ్యక్తిగత వాహనదారులు పొందవచ్చు. ఇది ఒక సంవత్సరం లేదా 200 టోల్‌ ప్రయాణాల వరకు వర్తిస్తుంది. జాతీ య రహదారుల టోల్‌ ప్లాజాలపై ఇది అమలు కానుంది. కావాలనుకున్న వాహనదారులు మా త్రమే వార్షిక పాస్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వార్షిక పాస్‌ అనేది పూర్తిగా స్వచ్ఛందం.

ఈ నెల 15 నుంచి అమలులోకి..

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ ఫాస్టాగ్‌ ఆఫర్‌ అందుబాటులోకి రానుంది. టోల్‌ ప్లాజా ను దాటిన ప్రతిసారి ఒక ట్రిప్పు గా లెక్క కడతా రు. ఉదాహరణకు మనం ప్రయాణంలో 4 టోల్‌ ప్లాజాలు దాటితే 4 ట్రిప్పులు పూర్తయినట్లు లెక్కిస్తారు. ఈ లెక్కన వార్షిక ఫాస్టాగ్‌ పాస్‌ అనే ది 200 సార్లు మాత్రమే పని చేస్తుంది. మొత్తం పూర్తి కాకపోతే ఏడాదంతా ఈ పాస్‌ పనిచేస్తుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా ముగిస్తే దానిని ఫాస్టాగ్‌కు తుది గడువుగా పరిగణిస్తారు.

ఎవరికి వర్తిస్తుందంటే…

ఫాస్టాగ్‌ ఉన్న వ్యక్తిగత వాహనదారులకు మాత్రమే వర్తిస్తుంది. టోల్‌ ఫీజు ఎంత ఉన్నా సంబంధం లేకుండా టోల్‌ ప్లాజా దాటవచ్చు. ప్రవేశం-నిష్క్రమణను ఒకే దాటుగా పరిగణిస్తారు. ఇది ప్రయాణ ఖర్చులను తగ్గించి వేగవంతమైన టోల్‌ క్లియరెన్స్‌కు దోహదపడుతుంది. పాస్‌ను టోల్‌ ప్లాజాలో లేదా ఆన్‌లైన్‌లో పొందవచ్చు.

సొంత వాహనదారులకు కొత్త ప్లాన్‌

ధర రూ.3 వేలు.. గరిష్టంగా 200 ట్రిప్పులు

టోల్‌ ప్లాజా ఎంట్రీ నుంచి ఎగ్జిట్‌కు ఒక ట్రిప్పుగా పరిగణన

కర్నూలు-కడప హైవేలో వేలాది మందికి ఉపయోగం

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రైవేటు లిమిటెడ్‌ ద్వారా నిర్వహిస్తున్న కర్నూ లు నుంచి కడప వరకు 40వ నంబర్‌ జాతీయ రహదారిలో ప్రయాణించే వేల మంది ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరం. ఈ మార్గాన్ని వినియోగించే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన ఈ నిర్ణయం డిజిటల్‌ ఇండియా స్మార్ట్‌ మౌలిక సదుపాయాల లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. – వి.మదన్‌మోహన్‌, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రైవేటు లిమిటెడ్‌ ప్రాజెక్ట్‌ హెడ్‌

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.