బే ఏరియాలో ఘనంగా ‘ఎన్టీఆర్‌ 101వ జయంతి’ ఉత్సవాలు

తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను బే ఏరియాలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ‘జయరాం కోమటి’ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.


కాలిఫోర్నియా: తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను బే ఏరియాలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ‘జయరాం కోమటి’ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ అభిమానులు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం బే ఏరియా నుంచి ఎంతోమంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌ వెళ్లి పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా వారు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధిస్తుందని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు భక్త భల్లా, వెంకట్ కోగంటి, సుబ్బ యంత్ర, శ్రీనివాస్ వల్లూరిపల్లి, విజయ్ గుమ్మడి, సతీశ్‌ అంబటి, హరి సన్నిధి, వెంకట్ అడుసుమల్లి, లియోన్ రెడ్డి బోయపాటి, వెంకట్ మద్దిపాటి, సుధీర్ ఉన్నం, వెంకట్ జెట్టి, భరత్ ముప్పిరాళ్ల, రవి కిరణ్, నరహరి మార్నేని, హరి బాబు బొప్పూడి, వంశీ కృష్ణ నేలకుదిటి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.