ఎన్టీఆర్ బావమరిది పెళ్లి ముహూర్తం ఫిక్స్! అమ్మాయి ఎవరో తెలుసా?

మ్యాడ్ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్. మొదటి లోనే ఎనర్జిటిక్ గా నటించి ఆడియెన్స్ మన్ననలు అందుకున్నాడు. ఆ తర్వాత ఆయ్ తోనూ ప్రేక్షకులను మెప్పించాడు.


ఇక ఈ ఏడాది మాడ్ స్క్వేర్ తో వరుసగా హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. కొన్ని రోజుల క్రితమే ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ అంటూ మరోసారి ఆడియెన్స్ ను పలకరించిన నార్నే నితిన్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. ఈ హీరోకు ఇది వరకే శివానీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. గతేడాది నవంబర్ 3 న జరిగిన నితిన్- శివానీ ఎంగేజ్ మెంట్ వేడుకలకు ఎన్టీఆర్, వెంకటేష్ కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు. నార్నే నితిన్ ఎంగేజ్ మెంట్ వేడుకలకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. అయితే ఎంగేజ్‌మెంట్ జరిగిన ఏడాది పూర్తి కావొస్తున్నా నార్నే నితిన్ పెళ్లి డేట్ ప్రకటించకపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో తాజాగా, నార్నే నితిన్-శివానీల పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 10న వీరిద్దరు ఏడడుగులు నడవనున్నట్లు సమాచారం. ముహూర్తం దగ్గర పడుతుండడంతో పెళ్లి పనులు కూడా ఊపందనుకున్నాయని సమాచారం. ఎన్టీఆర్, ప్రణతి కూడా ఈ పెళ్లి పనుల్లో నిమగ్నమైనట్లు టాక్ నడుస్తోంది.

ఇక శివాని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్ స్వరూప దంపతుల కుమార్తె. నెల్లూరులో వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబానికి కూడా శివానీ సమీప బంధువులని తెలుస్తోంది. ప్రస్తుతం నార్నే నితిన్ పెళ్లి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. త్వరలోనే ఈ పెళ్లిపై ఒక అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.