O బ్లడ్ గ్రూప్ పర్సన్స్ చాలా స్పెషల్.. ఈ 7 విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

www.mannamweb.com


O Blood Group: మన శరీరంలో 4 రకాల బ్లడ్ గ్రూపులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. A, B, AB, O బ్లడ్ గ్రూపులను పాజిటివ్, నెగిటివ్‌గా విభజించారు. ఇందులో O పాజిటివ్, O నెగిటివ్ బ్లడ్ గ్రూపులకు విశిష్ఠ లక్షణాలు ఉంటాయి.

O నెగిటివ్ బ్లడ్ గ్రూపు కలిగిన వారిని విశ్వ దాతలుగా(Universal Donors)గా పిలుస్తారు. O పాజిటివ్ బ్లడ్ గ్రూపు వారు ఎక్కువ మందికి రక్తదానం చేయొచ్చు. అయితే, ఇతరులకు ఈ గ్రూప్ రక్తం ఎక్కించేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే, పరిస్థితులు కాంప్లికేట్ అవుతాయి. మరి, ఈ బ్లడ్ గ్రూపుకి ఉన్న ప్రత్యేకతల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. O బ్లడ్ గ్రూప్‌ ఉన్నవారి 7 ప్రత్యేక గుణాలేంటో తెలుసుకుందాం.

* O నెగిటివ్- అరుదైన బ్లడ్ గ్రూప్: O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు విశ్వ దాతలు అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా వీరి సంఖ్య చాలా తక్కువ. కేవలం 2 నుంచి 3 శాతం ప్రజల్లో మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉంది. దీంతో వీరిని ఎంతో విలువైన వారిగా పరిగణిస్తారు.

* మోస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్: ప్రపంచంలో ఎక్కువ మందికి ఉండే బ్లడ్ గ్రూప్‌లలో O పాజిటివ్ ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 37 నుంచి 45 శాతం మంది ప్రజల బ్లడ్ గ్రూప్ ఇదే కావడం విశేషం. దీంతో రక్తదానం, స్వీకరణకు ఈ బ్లడ్ గ్రూప్ ప్రైమరీ ఛాయిస్‌గా మారింది.

* O పాజిటివ్, O నెగిటివ్ మధ్య తేడా: చాలా మందికి O పాజిటివ్, O నెగిటివ్‌ మధ్య తేడా ఏంటనే సందేహం ఉంటుంది. అయితే, వీటిలో ప్రధాన తేడా Rh ఫ్యాక్టర్ మాత్రమే. ఎర్రరక్త కణాల ఉపరితలంపై ఈ Rh ఫ్యాక్టర్ అనే ప్రొటీన్ ఉంటే అది O పాజిటివ్ అని అర్థం. ఒకవేళ ఈ ప్రొటీన్ లేకపోతే దానిని O నెగిటివ్‌గా గుర్తించాలి.

* విశ్వదాత బ్లడ్ గ్రూప్: O నెగిటివ్ బ్లడ్ గ్రూప్‌కి విశ్వదాత అనే బిరుదు ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు మిగతా మూడు బ్లడ్ గ్రూపుల వారికి రక్తదానం చేయవచ్చు. O నెగిటివ్ గ్రూపు కలిగిన రక్తం.. A, B, AB రక్తవర్గాల వారికి ఇమిడిపోతుంది. దీంతో ఎలాంటి సమస్యలు రావు.

* పేరెంట్స్ బ్లడ్ గ్రూప్ ఎఫెక్ట్: పేరెంట్స్ బ్లడ్ గ్రూపులను బట్టి పుట్టబోయే పిల్లలకు O పాజిటివ్, O నెగిటివ్ బ్లడ్ గ్రూపు వచ్చే అవకాశం ఉంటుంది.

* O పాజిటివ్ ప్రాధాన్యత: O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వారు విశ్వదాతలు అయినప్పటికీ, O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు కూడా ఎక్కువ మందికి రక్తదానం చేయవచ్చు. O పాజిటివ్, A పాజిటివ్, B పాజిటివ్, AB పాజిటివ్ బ్లడ్ గ్రూపులకు రక్తం డొనేట్ చేయొచ్చు

* O నెగిటివ్ తత్వం: O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల శరీర తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు Rh పాజిటివ్ రక్తాన్ని స్వీకరిస్తే వారిలో యాంటీబాడీలు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.