ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉద్యోగం, రూ.80,000 జీతంతో ఆఫీసర్ పోస్టింగ్

 ఇన్సూరెన్స్ కంపెనీ బిగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది.


2025 ఆగస్టు 7వ తేదీ అంటే నేటి నుంచి అధికారిక వెబ్సైట్ అయిన newindia.co.in ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరణ చేపట్టింది. ఇక 2025 ఆగస్టు 30న దరఖాస్తుకు చివరి తేదీ.

ఎంపిక విధానం..
న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తగిన అర్హత కలిగి ఉండాలి. వారి వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఈ ఇన్సూరెన్స్‌ కంపెనీ నోటిఫికేషన్ పిడిఎఫ్ రూపంలో కూడా విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 30వ తేదీ లోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 సెప్టెంబర్ 14వ తేదీన ప్రిలిమినరీ ఎగ్జామ్‌ ఉంటుంది. అందులో అర్హత సాధించినవారికి మెయిన్స్ ఎగ్జామ్ 2025 అక్టోబర్ 29న నిర్వహించనున్నారు.

ఖాళీలు ఇలా..
అధికారిగా వెబ్‌సైట్ నుంచి పిడిఎఫ్ ని డౌన్‌లోడ్ చేసుకుంటే అందులో వివరాలు క్షుణ్ణంగా చెక్ చేసుకోవచ్చు. మీ రాష్ట్రాలవారీగా ఖాళీలు కూడా అందులో ఉన్నాయి. అప్లై చేసుకునే ముందు అభ్యర్థులు క్షుణ్ణంగా నోటిఫికేషన్ చదవండి. ఆ తర్వాత నేరుగా డైరెక్ట్ లింకు ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇప్పటినుంచే మెరుగ్గా చదవడం మొదలుపెడితే జాబ్ కొట్టే అవకాశం కూడా ఉంది. NIACL ముంబై హెడ్‌క్వార్టర్‌గా పనిచేస్తున్న ఓ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. 1919లో దీన్ని స్థాపించారు. ఆ తర్వాత 1973లో దీనిని జాతీయం చేశారు.

జీతం..
ఇక ఈ పోస్ట్ ఈ లో మీరు ఎంపిక అయితే మెట్రోపాలిటన్ సిటీ ఆధారంగా మీ జీతం రూ. 80 వేల వరకు ఉండవచ్చు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తిగా చదవండి.

అర్హత వివరాలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ/ పీజీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి ఉండాలి. 60% మార్కులు సంపాదించాలి. ఇక చార్టెడ్ అకౌంట్ పోస్టులకు అయితే 60% పొంది ఉండాలి. .

సిలబస్‌..
ఎగ్జామ్ మొత్తంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ పై ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కుల ప్రశ్నలకు 60 నిమిషాల టైం కేటాయిస్తారు. అయితే మెయిన్స్ ఎగ్జామ్ లో డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది. ఇందులో మొత్తం 200 మార్కుల ప్రశ్నాపత్రం కలిగి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.