Ola Gen 3 Electric Scooter : ఒక్కసారి ఛార్జీ చేస్తే 320కి.మీ..

భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ మరో కొత్త అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. కస్టమర్ల కోసం కంపెనీ జెన్ 3 స్కూటర్ సిరీస్‌ను విడుదల చేసింది.


ఈ కొత్త జనరేషన్ స్కూటర్లలో Ola S1 Pro, Ola S1 Pro Plus, Ola S1X, Ola S1X Plus మోడళ్లు ఉన్నాయి. తాజా MoveOS 5 ద్వారా ఇవి మరింత అధునాతన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చాయి.

పలుచోట్ల మెరుగైన మెకానికల్ మార్పులు
గత మోడళ్లలో హబ్ మోటార్ను ఉపయోగించిన ఓలా, ఇప్పుడు మిడ్ డ్రైవ్ మోటార్, ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోల్ యూనిట్ ను ప్రవేశపెట్టింది. దీని వలన స్కూటర్ పనితీరు మెరుగుపడటమే కాకుండా, మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం లభిస్తుంది.

Gen 3 స్కూటర్ల ముఖ్య ఫీచర్లు
* బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ: బ్రేక్ సిస్టమ్‌ను మరింత సమర్థవంతంగా మార్చి, పరిధిని 15% పెంచుతుంది.
* యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS): రైడర్ భద్రత కోసం అన్ని మోడళ్లలో ABS అందించబడింది.
* వేగం & మైలేజ్: ప్రో ప్లస్ మోడల్ గరిష్టంగా 141 కి.మీ/గం వేగంతో నడుస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే 320 కి.మీ వరకు ప్రయాణించగలదు.
* తగ్గిన ధరలు: కొత్త స్కూటర్ ధరలు పాత మోడళ్ల కంటే 31% తక్కువగా ఉంటాయి.
* పీక్ పవర్ పెరుగుదల: పాత మోడళ్లతో పోలిస్తే 53% అధిక పవర్ ఇచ్చేలా రూపొందించబడింది.

Ola S1X Gen 3 ధరలు (ఎక్స్-షోరూమ్)
* Ola S1X 2kWh – రూ.79,999
* Ola S1X 3kWh – రూ.89,999
* Ola S1X 4kWh (టాప్ మోడల్) – రూ.99,999
* Ola S1X Plus 4kWh – రూ.1,07,999

Ola S1 Pro Gen 3 ధరలు (ఎక్స్-షోరూమ్)
* Ola S1 Pro 3kWh – రూ.1,14,999
* Ola S1 Pro 4kWh – రూ.1,34,999
* Ola S1 Pro Plus 4kWh – రూ.1,54,999
* Ola S1 Pro Plus 5.5kWh – రూ.1,69,999

ఓలా కొత్త జనరేషన్ 3 స్కూటర్లతో ఎలక్ట్రిక్ వెహికల్ విపణిలో మరింత పోటీ పెరిగింది. ముఖ్యంగా, తగ్గిన ధరలు, పెరిగిన డ్రైవింగ్ పరిధి & పవర్, MoveOS 5 ఆధునిక సాంకేతికత ఇవి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ తెచ్చుకోవడానికి కారణం కావొచ్చు. ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలో దూసుకెళ్తున్న ఓలా, Gen 3 ప్లాట్‌ఫామ్‌తో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇక చూడాల్సిందల్లా ఈ కొత్త స్కూటర్లపై వినియోగదారులు ఎంత మేరకు స్పందిస్తారన్నది!