150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. వ్రణాలను తగ్గించే. రణపాల ప్రయోజనాలు తెలిస్తే

www.mannamweb.com


రణపాల ఆకు దళసరిగా ఉంటుంది. దీని రుచి వగరు, పులుపుగా ఉంటుంది. ఈ మొక్క ఆకుల నుండే వేర్లు వస్తాయి. ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి.

రణపాల ఆకు తిన్నా, కషాయం తయారు చేసి తీసుకోవడం,ఆకు రుబ్బి కట్టు కట్టడం ద్వార చాల ఉపయోగాలు ఉన్నాయి. రణపాల ఆకు తింటే 150కి పైగా రోగాలను నయం చేస్తుందని వైద్యనిపుణులు వెల్లడించారు. జీర్ణాశయంలో అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్దకం సమస్యలను నివారిస్తుంది.

రణపాల ఆకులు కిడ్నీల సమస్యలను నివారిస్తుంది. బ్లాడర్ లో ఉండే స్టోన్లు కరిగిపోతాయి. డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. రణపాల మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, అనాఫిలాక్టిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి.

కామెర్లు ఉన్నవారు ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని 30 ఎంఎల్ తీసుకుంటే వ్యాధి నయం అవుతుంది. రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలను నివారిస్తుంది. రణపాలలో జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేసే గుణాలు ఉన్నాయి.

రణపాల ఆకులను పేస్ట్ లా చేసి నుదుటిపై పట్టీలా వేస్తే తలనొప్పి తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల వెంట్రుకలు రావడం ఆగుతుంది. దీని ఆకులని వేడిచేసి గాయాల పైన పెట్టడడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ఈ ఆకులని నూరి పొట్టుగా తల పైన పెట్టుకోవడం వల్ల తల నొప్పి తగ్గుతుంది. ఈ ఆకుల పసరుని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవినొప్పి తగ్గుతుంది.