ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. రీసెంట్ గా 4జీ నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ అయింది.ఈ సందర్భంగా మంచి మంచి రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకోస్తోంది. తాజాగా 330 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్ తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ కేవలం రెండు రోజులే అందుబాటులో ఉంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
రీసెంట్ గా బీఎస్ఎన్ఎల్ 4జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా దాదాపు లక్ష కొత్త 4జీ టవర్లను ఏర్పాటు చేసింది. అలాగే కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. అందులో భాగంగా ఒక స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. రూ.1999 పెట్టి రీఛార్జ్ చేస్తే.. 330 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ ఆఫర్ ఈ రోజు(అక్టోబర్ 15)తో ముగుస్తుంది.
ప్లాన్ డీటెయిల్స్
బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన ప్లాన్ ధర రూ. 1999 ఉంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 330 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. అలాగే భారతదేశం అంతటా అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్ లభిస్తుంది. ఈ ప్లాన్ లో రోజుకు 1.5జీబీ హై-స్పీడ్ 4జీ డేటాతోపాటు రోజుకి100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు వస్తాయి. ఈ ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ లేదా సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే మరో 2 శాతం అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.
ఏడాదిలో 5జీ
ఇక దీంతోపాటు ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు 350కు పైగా టీవీ ఛానల్స్, పలు ఓటీటీ యాప్స్ కు కూడా యాక్సెస్ పొందొచ్చు. ఏదేమైనా ఇతర టెలికాం కంపెనీలకు పోటీ ఇచ్చేలా బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన ఆఫర్లు తీసుకొస్తోంది. మరో ఏడాదిలో 4జీ నుంచి 5జీకి అప్‌గ్రేడ్ అవ్వనున్నట్టు బీఎస్ఎన్ఎల్ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ 5జీ లోకి ఎంట్రీ ఇస్తే ఎయిర్ టెల్, జియోలకు పోటీగా తక్కువ ధరలకే మంచి ప్లాన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది.
































