ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్.. త్వరలోనే వన్ ప్లస్ 13 మొబైల్ ను ఇండియాలో లాంఛ్ చేయబోతుంది. ఈ నేపథ్యంలో ఇంతకు ముందు లాంఛ్ చేసిన వన్ ప్లస్ 12 మొబైల్ ధరలు విపరీతంగా తగ్గిపోయాయి.
ఈ మొబైల్ పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ భారీ తగ్గింపును అందిస్తున్నాయి.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్.. ఇప్పటికే వన్ ప్లస్ 13 మొబైల్ ను ఆ దేశంలో లాంఛ్ చేసింది. ఇక త్వరలోనే ఇండియాలో సైతం ఈ మొబైల్ లాంచింగ్ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు అదిరిపోయే అప్డేట్స్ తో ఈ కొత్త మొబైల్ మార్కెట్లోకి రాబోతుంది. ఇక వన్ ప్లస్ 13 రాబోతున్న నేపథ్యంలో వన్ ప్లస్ 12 మొబైల్ పై భారీ తగ్గింపును ప్రకటించింది. 16GB టాప్ వేరియంట్ ఇప్పుడు 8GB బేస్ వేరియంట్ ధరలోనే అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్ ధరతో పాటు ఫీచర్స్ పై ఓ లుక్ వేయండి.
OnePlus 12R (16GB వేరియంట్) అసలు ధర రూ. 45,999. అయితే ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఇది రూ. 39,999 కే అందుబాటులో ఉంది. కాగా ఇది దాని బేస్ వేరియంట్ 8GB ప్రారంభ ధర. అంటే ఈ మెుబైల్ దాని అసలు ధరపై ఫ్లాట్ 13% తగ్గింపుతో ఉన్నట్టే. దీని వలన ధర రూ. 6,000 తగ్గుతుంది. దానితో పాటు ధరను మరింత తగ్గించడానికి కొన్ని బ్యాంక్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అయితే ఈ కొనుగోలుపై రూ. 3,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. దీంతో ధర రూ.36,999కే కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ ఆఫర్ లో OnePlus 12Rను ఇప్పుడే కొనుగోలు చేస్తే దానిపై రూ. 9,000 తగ్గింపు లభిస్తుంది. ఇప్పటివరకు ఈ మొబైల్ పై బెస్ట్ తగినంత ఇదే అని చెప్పవచ్చు.
ఇక ఈ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ ను సైతం వన్ ప్లస్ అందిస్తుంది. మొబైల్ ను ఎక్స్చేంజ్ చేసుకుంటే భారీ తగ్గింపును ప్రకటించింది. టాప్ బ్రాండ్ మొబైల్ పని తీరును అంచనా వేసి స్మార్ట్ ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ధరను వన్ ప్లస్ నిర్ణయిస్తుంది. దీంతో ఈ మొబైల్ ను ఇంకా తక్కువ ధరకే కొనే అవకాశం ఉంటుంది.
OnePlus 12R స్పెసిఫికేషన్స్ –
OnePlus 12R మెుబైల్ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ మద్దతుతో వచ్చేసింది. ఇక గరిష్ట బ్రైట్నెస్ 4500 నిట్స్. ఇది Snapdragon 8 Gen 2 చిప్‌సెట్, OxygenOS 15పై నడుస్తుంది. కెమెరా ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చేసింది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీను కలిగి ఉంది.