ఓటీటీలోకి ఒక్కరోజే (డిసెంబర్ 20) ఏకంగా 12 సినిమాలు తెలుగు భాషలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో మూడు మాత్రం తెలుగు స్ట్రైట్ సినిమాలు ఉంటే..
మిగతావన్నీ ఇతర భాషల నుంచి డబ్ చేసిన మూవీస్. మరి ఆ సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, కచ్చితంగా చూడాల్సిన చిత్రాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
యో యో హనీ సింగ్ ఫేమస్ (తెలుగు డబ్బింగ్ హిందీ డాక్యుమెంటరీ ఫిల్మ్)- డిసెంబర్ 20
ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ వార్ డ్రామా చిత్రం)- డిసెంబర్ 20
ఆహా ఓటీటీ
జీబ్రా (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 20
పొట్టేల్ (తెలుగు థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 20
జియో సినిమా ఓటీటీ
మూన్ వాక్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 20
ఫెంటాస్టిక్ బీస్ట్స్ ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్డోర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా)- డిసెంబర్ 20
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
అలనాటి రామచంద్రుడు (తెలుగు రొమాంటిక్ చిత్రం)- డిసెంబర్ 20
పొట్టేల్ (తెలుగు థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 20
బీస్ట్ గేమ్స్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రియాలిటీ కాంపిటీషన్)- డిసెంబర్ 20
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
ది రూమ్ (తెలుగు డబ్బింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 20
బాయ్ కిల్స్ వరల్డ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 20
క్యూబికల్స్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- డిసెంబర్ 20
త్రీ మెన్ అండ్ ఏ ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇటాలియన్ హారర్ కామెడీ సినిమా)- వీఆర్ ఓటీటీ- డిసెంబర్ 20
సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్స్
ఇలా ఒక్కరోజులోనే ఏకంగా 12 సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో అనన్య నాగళ్ల నటించిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పొట్టేల్ అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. అలాగే, హీరో సత్యదేవ్ నటించిన బ్యాంక్ బ్యాక్‌డ్రాప్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జీబ్రా కూడా చాలా ఇంట్రెస్టింగ్ మూవీ.
అలాగే, తెలుగు చిన్న బడ్జెట్ మూవీగా వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ అలనాటి రామచంద్రుడు కూడా మంచి ఫీలింగ్ ఇచ్చే సినిమా కానుంది. వీటితోపాటు తెలుగులో డబ్ అయిన హిందీ స్టార్ సింగర్ హనీ సింగ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ యో యో హనీ సింగ్ ఫేమస్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది.
హారర్ కామెడీ-సైన్స్ ఫిక్షన్
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ది రూమ్, వార్ డ్రామా మూవీ ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్, కామెడీ హారర్ సినిమా త్రీ మెన్ అండ్ ఏ ఘోస్ట్ సైతం స్పెషల్‌గా ఉన్నాయి. ఇలా దాదాపుగా అన్ని యాక్షన్, హారర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అడ్వెంచర్, రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్స్ వంటి వివిధ జోనర్స్‌లో కచ్చితంగా చూడాల్సిన సినిమాలుగానే ఉన్నాయి.
అయితే, పొట్టేల్, జీబ్రా, త్రీ మెన్ అండ్ ఏ ఘోస్ట్, బాయ్ కిల్స్ వరల్డ్, యో యో హనీ సింగ్ ఫేమస్, ఫెంటాస్టిక్ బీస్ట్స్ ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్డోర్, ది రూమ్ ఈ ఏడు సినిమాలు మాత్రం మరింత ఎక్కువగా కచ్చితంగా చూడాల్సిన మూవీస్ అని చెప్పుకోవచ్చు.