ఎస్బీఐలో 13 వేలకుపైగా ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి

www.mannamweb.com


బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. ఏకంగా 13,735 క్లర్క్ (జూనియర్ అసోసియేషన్) ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు:

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయో పరిమితి:

అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1, 2024 నాటికి తప్పనిసరిగా 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అంటే ఏప్రిల్ 2, 1996 నుంచి ఏప్రిల్ 1, 2004 (ఇంక్లూసివ్) మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తునకు అర్హులు. ఎస్సీ/ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ(జనరల్/ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 సంవత్సరాు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుం:

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

పరీక్ష విధానం:

అన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు), స్థానిక భాష ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు స్వీకరణ: డిసెంబర్ 17, 204

దరఖాస్తు చివరి తేదీ: జనవరి 7 2025

ప్రిలిమినరీ పరీక్ష తేదీ :

ప్రాథమిక సమాచారం ప్రకారం 2025 ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన తేదీలు త్వరలో ప్రకటించవచ్చు.

మెయిన్‌ పరీక్ష తేదీ :

ప్రాథమిక సమాచారం ప్రకారం 2025 మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో ఉండొచ్చు. ఖచ్చితమైన తేదీలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

దరఖాస్తు ప్రక్రియ:

ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి.

ఆ తర్వాత హోంపేజీలో కనిపించే కెరీర్స్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

దీంతో ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు అక్కడ కరెంట్ ఓపెనింగ్ లింక్‌పై క్లిక్ చేయాలి.

మళ్లీ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ పేజీలో అందుబాటులో ఉన్న SBI Junior Associate లింక్ పై క్లిక్ చేయాలి.

దీంతో అప్లికేషన్ ఆన్‌లైన్ లింక్ వస్తుంది. ఆపై దానిపై క్లిక్ చేసి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.

అనంతరం అకౌంట్లోకి లాగిన్ అయి అప్లికేషన్ ఫాంలో అవసరమైన వివరాలన్నింటినీ నమోదు చేయాలి. ఆపై అడిగిన డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయాలి.

చివరంగా ఫాంను సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అప్పుడు మీకు అప్లికేషన్ ఫాం వస్తుంది. దాన్ని తదుపరి అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.