బైక్ ఈఎంఐతో సొంత కారు.. ఎస్‌బీఐ బంపరాఫర్!

తక్కువ ధరలో అందుబాటు ఈఎంఐతో కొత్త కారు కొనేందుకు రెడీ అవుతున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్. ఈ ఈఎంఐ ఆఫర్ తెలుసుకోవాల్సిందే.


కొత్తగా కారు కొనే వారికి గుడ్ న్యూస్.. దేశీ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు తక్కువ ఈఎంఐతో కారు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. దీని వల్ల చాలా మందికి ఈ పండుగ సీజన్‌లో కారు కొనే ప్లానింగ్ ఉంటే.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంతకీ ఎస్‌బీఐ డీల్స్ ఏంటి? ఏ కారుపై ఎంత ఈఎంఐ పడుతుంది? తక్కువ ఈఎంఐ ఏ మోడల్‌పై ఉంది? వంటి అంశాలను తెలుసుకుందాం.

ఎస్‌బీఐ తన యోనో యాప్‌లో కారు లోన్ సేవలు అందిస్తోంది. మీరు దీని ద్వారా మీకు నచ్చిన అందుబాటులో ఉన్న కారును కొనుగోలు చేయొచ్చు. లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు ఇంకా ఈఎంఐ ఆప్షన్లను కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తక్కువ ఈఎంఐలో ఏ కారు లభిస్తోందో ఒకసారి చూద్దాం.

స్టేట్ బ్యాంక్ యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత ఎడమ వైపు పైన ముూడు గీతలు కనిపిస్తాయి. దానిపై క్లిక్ చేయాలి. విండో ఓపెన్ అవుతుంది. ఇందులో లోన్స్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు కారు లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు కొత్త విండో ప్రారంభం అవుతుంది. ఇందులో యోనో మోటార్జ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీకు ఆఫర్లు కనిపిస్తాయి. ఎక్స్‌ప్లోర్ ఆఫర్స్‌పై క్లిక్ చేయాలి.

లేదంటే సెర్చ్ కార్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు కార్లు డిస్‌ప్లే అవుతాయి. వాటిల్లో మీకు నచ్చిన కారును ఎంచుకోవాలి. ఇందులో హ్యుందాయ్ శాంట్రో కారు కూడా ఉంటుంది. ఈ కారుపై తక్కువ ఈఎంఐ ఆప్షన్ కనిపిస్తోంది. ఈ కారు ధర రూ. 4.86 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఈ కారు కొంటే మీకు నెలవారీ ఈఎంఐ రూ7,700 నుంచి ప్రారంభం అవుతుంది. 84 నెలల టెన్యూర్‌కు ఈ ఈఎంఐ పడుతుంది. ఆన్‌రోడ్ ధరకు ఫైనాన్స్ లభిస్తుంది. వడ్డీ రేటు 8.85 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.

అంటే మీరు చేతి నుంచి డబ్బులు పెట్టుకోకుండానే కొత్త కారును ఇంటికి తీసుకువెళ్లొచ్చు.అందువల్ల మీరు కొత్త కారు కొనే యోచనలో ఉంటే మాత్రం ఈ ఎస్‌బీఐ డీల్ సొంతం చేసుకోవచ్చు. యాప్ నుంచే కారు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు ఉంటే కారు లోన్ కొనేందుకు లోన్ వస్తుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో రూ.7 వేల రేంజ‌్‌లో ఈఎంఐ అంటే తక్కువ అనే చెప్పుకోవచ్చు. చాలా మంది టూవీలర్ కొన్నా కూడా నెలకు రూ.6 వేల వరకు ఈఎంఐ పడుతుంది. 24 నెలల టెన్యూర్ పెట్టుకుంటే చాలా మందికి ఈ రేంజ్‌లో ఈఎంఐ పడుతుంది. అంటే అప్పుడు కారు లోన్ ఈఎంఐకు దీనికి పెద్దగా తేడా ఉండదని అనుకోవచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.