Business Ideas: ఊర్లోనే సొంత వ్యాపారం.. నెలకు రూ. 50 వేల సంపాదన.. అవేంటంటే.?

ఉద్యోగం బోర్ కొట్టిందా.? లేక వచ్చే సంపాదన సరిపోవట్లేదా.? అయితే టెన్షన్ ఎందుకు ఉన్న ఊర్లోనే కాలు కదపకుండా పలు సొంత వ్యాపారాలు ఈజీగా చేసుకోవచ్చు. గ్రామం నుంచి బయటకు వెళ్ళాల్సిన పనే లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక వ్యాపార ఆలోచనలు ఉన్నాయి. వీటితో ప్రతీ నెలా రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు సంపాదించవచ్చు. మరి అవేంటో చూసేద్దామా..


1. పాల వ్యాపారం:
మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంది.. ఆవులు, గేదెలు ఉన్నట్లయితే.. పాల వ్యాపారం చాలా బెస్ట్ ఆప్షన్. ఇది స్టార్ట్ చేయడానికి డబ్బులు తక్కువగా వెచ్చించవచ్చు.. అలాగే వచ్చే ఆదాయం కూడా ఎక్కువే.

2. బల్క్ మిల్క్ కూలర్:
ఈ బిజినెస్ కోసం మీకున్న కొంచెం స్థలంలో మొక్కలు పెంచడం, పశువులను చూసుకోవడం లాంటివి చేయాలి. ఎక్కువ మోతాదులో పాలను సేకరించి.. అవి పాడవ్వకుండ యంత్రాల్లో దాచండి. వాటిని మీ గ్రామాల్లో, చుట్టుప్రక్కల ఊర్లలో అమ్మకాలు చేయవచ్చు. దీనికోసం మీరు ప్రభుత్వం సాయంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవచ్చు.

3. విత్తనాలు, ఎరువుల దుకాణం:
విత్తనాలు, ఎరువుల దుకాణం గ్రామాల్లో ఉండే రైతులకు చాలా బెస్ట్ ఆప్షన్. వారికి అవగాహన కల్పిస్తూ.. అధునాతన పద్దతుల్లో విత్తనాలు, ఎరువులు ఎలా పొలాల్లో చల్లాల్లో రైతులకు చెబుతూ.. ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.

4. మెడికల్ స్టోర్:
మెడికల్ స్టోర్ గ్రామాల్లో ఉన్న ప్రజలకు చాలా అవసరం. ఇది ఎక్కడైనా మంచి లాభదాయక వ్యాపారం. అయితే దీనిపై పూర్తి అవగాహన ఉండాలి. అలాగే ఎక్కువగా అవసరమయ్యే మందులను విక్రయించడం ద్వారా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయవచ్చు.