సాధారణంగా కర్పూరం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ కర్పూరం కాగా ఇంకొకటి పచ్చ కర్పూరం. సాధారణ కర్పూరాన్ని హారతి కోసం వాడుతారు.
అయితే పచ్చ కర్పూరాన్ని పూజల్లో ఉపయోగిస్తారు. దీన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం మనం మన శరీరంలోకి కూడా తీసుకోవచ్చు. ఆయుర్వేద పరంగా పచ్చ కర్పూరం మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇక ఆధ్యాత్మిక పరంగా కూడా పచ్చ కర్పూరం ఎంతో విశిష్టమైన శక్తిని కలిగి ఉంటుంది. పచ్చ కర్పూరం అందించే లాభాలు తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. పచ్చ కర్పూరం మన ఇంట్లో ఉండడం వల్ల ఆధ్యాత్మిక పరంగా మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
పచ్చ కర్పూరాన్ని ఇంట్లో ఈ చోట్ల పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సాధారణంగా పచ్చ కర్పూరాన్ని ఇంట్లో పూజ గదిలో పెడతారు. పూజల్లోనూ పచ్చ కర్పూరాన్ని ఉపయోగిస్తారు. అయితే వాస్తు పరంగా కూడా దీంతో లాభాలు ఉంటాయి. ఇంట్లో పచ్చ కర్పూరాన్ని ఇప్పుడు చెప్పబోయేవిధంగా ఈ చోట్ల పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. దీన్ని ఆధ్యాత్మిక పండితులే స్వయంగా చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అప్పుల్లో బాగా కూరుకుపోయిన వారు ఇలా చేయడం వల్ల చక్కని ఫలితాలు వస్తాయి.
పచ్చ కర్పూరానికి చెందిన ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని కేవలం మంగళ లేదా శుక్రవారం రోజు మాత్రమే చేయాలి. అది కూడా ఉదయం 6 నుంచి 10 గంటల లోపు ఈ పరిహారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య కూడా చేయవచ్చు. అప్పుడే సరైన ఫలితం వస్తుంది.
ఒక వెండి లేదా ఇత్తడి ప్లేట్ తీసుకుని అందులో 10 రూపాయల నోటును పెట్టాలి. దానిపై పచ్చ కర్పూరం పొడి పోయాలి. ఇలా ప్రతి మంగళ లేదా శుక్రవారం చేయాల్సి ఉంటుంది. ఫలితం వచ్చే వరకు ఇలా చేయాలి. ఫలితం వచ్చాక కూడా కొన్ని వారాల పాటు ఈ పరిహారాన్ని కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుంది. మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై తీరుతుంది. అలాగే ఒక పాత్రలో రాళ్ల ఉప్పు వేసి అందులో పచ్చ కర్పూరం కూడా వేయాలి. దీన్ని వంట గదిలో స్టవ్ పక్కన పెట్టాలి. ఇక ఇంటి గుమ్మానికి పసుపు, పన్నీరు, పచ్చ కర్పూరం కలిపిన మిశ్రమాన్ని రాయాలి. ఇలా ఈ పరిహారాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. సంపదలను అనుగ్రహిస్తుంది. డబ్బుకు లోటు ఉండదు.