IPLతో ఢీ అంటున్న పాకిస్థాన్.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదే!

క్రికెట్ అనే కాదు.. వరల్డ్ స్పోర్ట్స్​లో రిచ్ లీగ్స్​లో ఒకటిగా ఐపీఎల్ పేరు తెచ్చుకుంది. ఈ లీగ్ వల్లే భారత క్రికెట్ బోర్డు ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా అవతరించింది. బీసీసీఐకి ఇది బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిది. ఏటా నెలన్నర పాటు నిర్వహించే ఐపీఎల్ వల్ల బోర్డు ఖాతాలో వేల కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. స్ట్రీమింగ్ రైట్స్, అడ్వర్టయిజ్​మెంట్స్, స్పాన్సర్ల నుంచి ధనంతో బీసీసీఐ ఖజానా నిండిపోతోంది. దీంతో వరల్డ్ క్రికెట్​ను శాసించే స్థితికి భారత్ చేరుకుంది. ఆసియా క్రికెట్​తో పాటు ఐసీసీలోనూ బీసీసీఐ ఏం చెబితే అది జరగాల్సిందే అనేలా పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఐపీఎల్​తో ఢీ అంటే ఢీ అంటోంది పాకిస్థాన్.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

అన్ని దేశాలు లీగ్స్ నిర్వహిస్తుండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఓ లీగ్​ను స్టార్ట్ చేసింది. అదే పాకిస్థాన్ సూపర్ లీగ్. ఈ లీగ్ సక్సెస్ అవడంతో పీసీబీకి మంచి ఆదాయం సమకూరింది. అయితే ఈ లీగ్​కు మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించాల్సిన పాక్ బోర్డు.. ఆ పని మానేసి ఇప్పుడు బీసీసీఐతో పెట్టుకుంటోంది. సాధారణంగా పీఎస్​ఎల్​కు ఐపీఎల్ షెడ్యూల్​కు మధ్య గ్యాప్ ఉంటుంది. కానీ ఐపీఎల్ సక్సెస్​ను చూసి ఓర్వలేని పాక్ బోర్డు.. క్యాష్ రిచ్ లీగ్​ను ఖతం చేయాలని కుట్ర పన్నుతోంది. అందులో భాగంగానే సరిగ్గా ఐపీఎల్ నిర్వహించే టైమ్​లోనే పీఎస్​ఎల్​ను ఆర్గనైజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఐపీఎల్ విండో మార్చి నుంచి మే మధ్యలో ఉంటుందనేది తెలిసిందే. ఇప్పుడు పీఎస్​ఎల్​ను కూడా సరిగ్గా ఇదే విండోలో నిర్వహించాలని పీసీబీ పట్టుదలతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్​ను పడగొట్టాలంటే సరిగ్గా అదే టైమ్​లో పీఎస్​ఎల్​ను విజయవంతంగా నిర్వహించాలని అనుకుంటోందట. అయితే ఈ వార్త గురించి తెలిసిన నెటిజన్స్ పాకిస్థాన్​పై విమర్శలకు దిగుతున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదేనని అంటున్నారు. ఐపీఎల్​కు ఏ విధంగానూ పీఎస్​ఎల్ సాటిరాదని.. ఇది పాక్ బోర్డుకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందని చెబుతున్నారు. ఒకే టైమ్​లో ఐపీఎల్​కు పోటీగా పెడితే యాడ్స్, వ్యూస్ పరంగా లాసెస్ తప్పవని హెచ్చరిస్తున్నారు. రోమాన్ పావెల్, జేసన్ రాయ్, సికిందర్ రజా, షెర్ఫేన్ రూథర్​ఫర్డ్, షమర్ జోసెఫ్, రీలీ రూసో, డేవిడ్ విల్లే లాంటి ఆటగాళ్లు ఈ రెండు లీగ్స్​లోనూ ఆడతారు. ఒకవేళ ఐపీఎల్​ టైమ్​లో పీఎస్​ఎల్ నిర్వహిస్తే ఎక్కువ డబ్బులు ఇక్కడే వస్తాయి కాబట్టి ఈ ప్లేయర్లు పాక్​కు వెళ్లరు. అది వాళ్లకు నష్టమేనని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *