టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు భార్యను సస్పెండ్ చేసిన ఏయూ రిజిస్ట్రార్!

ఏపీలో మే 13న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు.


ఆయన భార్య లావణ్య దేవి విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అయితే, ఈ నెల 4వ తేదీన భర్త తరఫున ఎన్నికల ప్రచారం చేశారంటూ లావణ్యకు రిటర్నింగ్ అధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అతిక్రమించారని పేర్కొన్నారు. నోటీసులకు స్పందించిన లావణ్య… తాను శ్రీవాణి అనే మహిళను కలిశానని, ఎలాంటి ర్యాలీలో పాల్గొనలేదని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెను ఏయూ రిజిస్ట్రార్ సస్పెండ్ చేశారు. కాగా, గాజువాకలో కూటమి తరఫున పల్లా శ్రీనివాసరావు బరిలో దిగగా, వైసీపీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేశారు.