భారత ప్రభుత్వం ఇటీవల పాన్ 2.0 ప్రాజెక్ట్ కింద ఆదాయ పన్ను విభాగం జారీ చేసే పాన్ కార్డులు పాత పాన్ కార్డ్ కంటే భిన్నంగా ఉంటాయి. కొత్త కార్డులపై క్యూఆర్ కోడ్ ఉంటుంది.
ఒక విధంగా చూస్తే కొత్తగా పాన్ కార్డ్ మీద ఉండే QR కోడ్ లక్షణాలు ఆధార్ కార్డ్ మీద ఉండే QR కోడ్ లక్షణాలను పోలి ఉంటాయి. పాన్ కార్డ్ QR కోడ్‌ని స్కాన్ చేస్తే ఆ కార్డ్ హోల్డర్ గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది.
కొత్త పాన్ కార్డును డిజిటల్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీంతో పాన్ కార్డు భద్రత పెరుగుతుంది. అంటే మీ పాన్ కార్డును వెంట తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీ ఫోన్ నుంచి దాని కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా లావాదేవీని పూర్తి చేయవచ్చు. కొత్త పాన్ కార్డును వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను కూడా సిద్ధం చేస్తోంది.
వాస్తవానికి మీ దగ్గర పాత పాన్ కార్డ్ ఉంటే పాన్ 2.0 కింద కొత్త పాన్ కార్డ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఇప్పటికే ఒక పాన్ కార్డ్ ఉన్నప్పటికీ, మీరు కొత్త కార్డ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. పాత పాన్ కార్డ్ మీద ఉండే నంబర్‌తోనే కొత్త పాన్ కార్డ్ జారీ అవుతుంది. అంటే పాతవాళ్లు కొత్త పాన్ కార్డు తీసుకుంటే కొత్త నంబర్ రాదు. మీ పాత పాన్ కార్డ్ కూడా మునుపటిలాగే పని చేస్తుంది.
ఒకవేళ పాన్ కార్డును కొత్త దానికి అప్ డేట్ చేసుకోవాలంటే ఎటువంటి మార్పులు లేకుండా చేసుకోవాలని ప్రభుత్వం తెలియజేస్తుంది. అలా అప్ డేట్ చేయడానికి ముందుగా NSDL యొక్క పాన్ రీప్రింట్ వెబ్ పేజీలో ధరకాస్తు చేయాలి.ఇందులో పాన్, ఆధార్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ వంటి అవసరమైన వివరాలను ఫిల్ చేయాలి.
అప్పడు మొబైల్ నంబర్ లో వచ్చిన OTPని నమోదు చేయాలి. మీకు ఈ పాన్ కార్డ్ ఇ-పాన్ కార్డుగా మాత్రమే కావాలంటే.. మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఈ పాన్ కార్డు చేతిలోకి రావాలంటే క్యూఆర్ కోడ్ తో పాన్ కార్డ్ రీప్రింట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు రూ.50 చెల్లించాలి. రూ.50 చెల్లించిన తర్వాత మీ పాన్ కార్డ్ రీప్రింట్ చేస్తారు. ధరఖాస్తుదారులు ఇచ్చిన అడ్రస్ కు పాన్ కార్డు పంపుతారు.