మీకెప్పుడైనా తీవ్ర భయం, ఆందోళనగా అనిపిస్తే.. వెంటనే ఇలా చేయండి! 2 నిమిషాల్లో నార్మల్‌ అవుతారు

www.mannamweb.com


మనిషి శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నా, మానసికంగా ప్రశాంతత లేకపోతే జీవన గందరగోళంగా ఉంటుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే దీర్ఘకాలిక రుగ్మతలకు దారి తీస్తుంది.

తద్వారా విపరీత ఆలోచనలతో ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది.

మితిమీరిన ఆందోళన, పని ఒత్తిడి, కుటుంబ సమస్యల గురించి అతిగా ఆలోచించడం మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇది ఆందోళన వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇది ఒక రకమైన మానసిక రుగ్మత. ఇది నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది.

కండరాల ఒత్తిడిని పెంచుతుంది. జీర్ణ సమస్యలు, చిరాకు, ఏకాగ్రత లేకపోవడం, తీవ్ర భయాందోళనలకు గురవుతుంటారు. దేశంలో దాదాపు 88% మంది ప్రజలు ఏదో ఒక రకమైన ఆందోళనతో బాధపడుతున్నారని ఒక అధ్యయనం వెల్లడించింది. అంటే ప్రతి 100 మందిలో 88 మంది ఈ మానసిక రుగ్మతకు గురవుతున్నారన్నమాట. కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరైనా పానిక్ అటాక్‌తో బాధపడుతున్నట్లయితే, ఇలా చేయండని మానసిక వైద్యులు సలహా ఇస్తున్నారు. మీరూ పానిక్ అటాక్‌తో బాధపడుతుంటే ఎలా సహాయం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

నీళ్లు తాగడం వల్ల వారిలో కొంత భయం, ఆందోళన తగ్గుతాయి. చల్లటి నీరు తాగడం వల్ల పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఇది వ్యక్తిని శాంతింపజేయడానికి సహాయపడుతుంది. తీవ్ర భయాందోళనకు గురైతే వెంటనే చేతులు, కాళ్ళను చల్లటి నీటితో కడగాలి. అలాగే టవల్‌ను తడిపి మీ ముఖం లేదా మెడపై ఉంచుకోవాలి. ఇది భయం నుండి కొంచెం శాంతపరచడానికి సహాయపడుతుంది.

మీ చుట్టుపక్కల లేదా ఇంట్లో ఎవరైనా భయాందోళనకు గురవుతున్నట్లు అనిపిస్తే.. మీరు వారి ప్రవర్తనను చూస్తే దూరంగా ఉండకండి. బదులుగా ఆ వ్యక్తిని సౌకర్యవంతమైన కుర్చీ లేదా సోఫాలో కూర్చోబెట్టి.. కాసేపు మీరు వారితో గడపడానికి ప్రయత్నించాలి.