ఇష్టంగా పానీపూరీ తింటున్నారా.. మీ ఆరోగ్యం డేంజర్‌లో పడినట్లే!

www.mannamweb.com


పానీపూరీ అంటే ఇష్టం లేని వాళ్లంటూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికి కూడా పానీ పూరీ అంటే ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు అయితే డైలీ పానీపూరీని తింటారు. ప్రస్తుతం రోజుల్లో పానీపూరీకి మంచి డిమాండ్ కూడా పెరిగింది. కానీ ఈ రోజుల్లో పానీపూరీని ఎవరూ కూడా జాగ్రత్తగా తయారు చేయరు. ఎక్కువగా మురికిగా ఉండే ప్రదేశాల్లో అశుభ్రత పాటిస్తూ ఈ పానీపూరీని తయారు చేస్తుంటారు.

పానీపూరీ అంటే ఇష్టం లేని వాళ్లంటూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికి కూడా పానీ పూరీ అంటే ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు అయితే డైలీ పానీపూరీని తింటారు. ప్రస్తుతం రోజుల్లో పానీపూరీకి మంచి డిమాండ్ కూడా పెరిగింది. కానీ ఈ రోజుల్లో పానీపూరీని ఎవరూ కూడా జాగ్రత్తగా తయారు చేయరు. ఎక్కువగా మురికిగా ఉండే ప్రదేశాల్లో అశుభ్రత పాటిస్తూ ఈ పానీపూరీని తయారు చేస్తుంటారు. దీనివల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడతారు. బంగాళాదుంపలు, శనగలు, ఉల్లిపాయ, మసాలా కూరలతో పానీపూరీని తయారు చేస్తారు. చింత పండు రసం, కొత్తిమీర వంటి రసాలతో పుల్లని వాటర్‌తో పానీపూరీని తయారు చేస్తుంటారు. దీన్ని తినడానికి చాలా మంది ఎగేసిపడుతుంటారు. ఇందులో అంతాలా టేస్ట్ ఏముంటుందో తెలియదు. కానీ సాయంత్రం అయితే చాలు పానీపూరీ షాపుల దగ్గర క్యూలు కడుతుంటారు. అయితే ఈ పానీ పూరీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు కంటే ఎక్కువగా నష్టాలే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి దీనివల్ల కలిగే ఆ నష్టాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

బరువు పెరుగుతారు
పానీ పూరీలో ఎక్కువగా క్యాలరీలు ఉంటాయి దీనివల్ల తొందరగా బరువు పెరుగుతారు. ఒక ప్లేటు పానీపూరీలో దాదాపుగా 200 నుంచి 300 క్యాలరీలు ఉంటాయి. ఇవి ఎంత తక్కువగా ఉంటే మీ బరువు నియంత్రణలో ఉంటుంది. అ. ఒక ప్లేట్ పానీ పూరిలో 200-300 క్యాలరీలు ఉండవచ్చు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

అనారోగ్య బారిన పడతారు
పానీపూరీని శుభ్రమైన ప్రదేశాల్లో తయారు చేయారు. నిజంగా దీన్ని తయారు చేసేటప్పుడు చూస్తే మాత్రం జన్మలో పానీపూరీ తినరు. శుభ్రంగా పానీపూరీని తయారు చేయరు అని తెలిసిన కూడా కొందరు తింటుంటారు. దీంతో ఫుడ్ ఇన్ఫెక్షన్, వాంతులు వంటి సమస్యలతో బాధపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణ సమస్యలు
పానీపూరీలో ఎక్కువగా సోడియం ఉంటుంది. అలాగే చింతపండు రసం వల్ల కొందరికి ఎక్కువగా జీర్ణ సమస్యలు వస్తాయి. తిన్నది జీర్ణం కాకపోవడం, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

క్యాన్సర్ బారిన పడతారు
పానీపూరీని కొందరు తయారు చేయకుండా రెడీమేడ్‌వి వాడుతుంటారు. వీటిని రసాయనాలతో తయారు చేయడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వస్తాయి. అలాగే కొందరికి ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. మార్కెట్‌లో లభ్యమయ్యే రెడీమేడ్ పానీపూరీ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతాయి. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మధుమేహం
కొందరు పూరీ బాగా పొంగాలని మైదా వాడుతుంటారు. దీన్ని తినడం వల్ల మధుమేహం వస్తుంది. ఇందులో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇవి శరీరానికి హానిని కలిగిస్తాయి. కానీ ఆరోగ్యానికి మంచి చేయవు. కాబట్టి పానీపూరీని తినడం మానేయండి. అవసరమైతే ప్రొటీన్‌తో ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవడం ఉత్తమం.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.