Pappu Yadav: లోక్‌సభలో ఎంపీ ‘నీట్’గా నిరసన, అధికార పక్షం మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన పప్పు యాదవ్!

www.mannamweb.com


Pappu Yadav: లోక్‌సభలో ఎంపీ ‘నీట్’గా నిరసన, అధికార పక్షం మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన పప్పు యాదవ్!

Pappu Yadav demands for Re NEET 2024 | దేశమంతటా నీట్ మీద చర్చ జరుగుతోన్న నేపథ్యంలో బిహార్ రాష్ట్రం నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైన ఓ ఎంపీ తన ప్రమాణ స్వీకార సమయంలోనే నీట్ పరీక్షపై నిరసన తెలిపి కొత్త సంస్కృతికి తెరలేపారు.

బిహార్ రాష్ట్రం పుర్నియా నుంచి ఎంపీగా ఎన్నికై మంగళవారం లోక్ సభలో ప్రమాణం చేసిన పప్పూ యాదవ్ రీనీట్ అని రాసి ఉన్న ఒక టీషర్ట్ వేసుకొచ్చారు. అయితే పప్పూ యాదవ్ అక్కడితో ఆగలేదు.

ప్రమాణం చేసిన అనంతరం సైతం.. రీ నీట్, బిహార్ కి స్పెషల్ స్టేటస్, సీమాంచల్ జిందాబాద్, మానవతా వాద్ జిందాబాద్, బీమ్ చిందాబాద్, సంవిధాన్ జిందాబాద్ అంటూ చెప్పారు. ఈ క్రమంలోనే ట్రెజరీ బెంచ్ పై ఉన్న సభ్యుడితో ఆయనకు వాగ్వాదమూ జరిగింది. ప్రమాణం అనంతరం బెంచ్ సభ్యులు ఏదో అంటుంటే.. ‘‘నేను ఆరోసారి ఎంపీగా ఎన్నికయ్యాను. ఏం చేయొచ్చో ఏం చేయకూడదో నాకు తెలుసు. మీరు గుంపుగా వస్తారు. కానీ నేను సింగిల్ గా వస్తాను. నాలుగో సారి ఇండిపెండెంట్ గా గెలిచాను. మీరు నాకు నేర్పిస్తారా?’’ అంటూ ఛైర్మన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ పప్పూ యాదవ్ స్టేజ్ దిగారు.