ఈ ప్రపంచంలో ఎన్నో వింత ఆచారాలు, సంప్రదాయాలు (Tradition) ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వింత ఆచారాలు ఉంటాయి. ఒకరి ఆచారాలు ఇంకోరు వింటే కాస్త వింతగానే అనిపిస్తుంది.
మన ఇండియాలోనే చాలా ప్రాంతాల్లో కొన్ని వింత ఆచారాలు ఉన్నాయి. అలాంటిది ఈ ప్రపంచం (World) మొత్తం మీద చూసుకుంటే ఇంకా చాలానే ఉంటాయి. అయితే పుట్టిన మనిషి మరణించ తప్పదు. ఇది జీవిత సత్యం. మరణించిన వారికి తప్పకుండా దహన సంస్కారాలు నిర్వహిస్తారు. సాధారణంగా హిందువులు అయితే అగ్ని సంస్కరణలు చేస్తారు. క్రిస్మియన్స్ అయితే పూడ్చుతారు. అలాగే పిల్లలను కూడా అగ్గిలో దహనం చేయకుండా పూడ్చుతుంటారు. అయితే ఈ ప్రపంచంలో ఓ తెగలు మాత్రం మనుషులను కాల్చరు. పోని పాతి పెడతారా అంటే అది లేదు. మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఏం చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఏ తెగ మృత దేహాన్ని పాతి పెట్టకుండా వింత ఆచారం పాటిస్తోంది? అసలు ఏంటి ఆచారం? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాపువా న్యూ గినియా అనే తెగలు మృతదేహాలను కాల్చరు. అలా అని పాతి కూడా పెట్టరు. ఇక్కడ చనిపోయిన వారిని ఓ ప్రత్యేక పద్ధతిలో దహనం చేస్తారు. ఇది ఇక్కడి వారి ఆచారం. ఒక్కో మతానికి, తెగకి కొన్ని ఆచారాలు ఉంటాయి. అలాగే ఈ తెగకు కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఆఫ్రికన్ దేశమైన పాపువా న్యూ గినియాలో ఉన్న ఈ వింత ఆచారం కొందరిని భయపెట్టిస్తుంది కూడా. ఈ తెగలో మరణించిన వారిని కాల్చకుండా, పాతకుండా శరీరాన్ని ఎత్తైన ప్రదేశంలో వెదురుకు వేలాడదీస్తారు. దగ్గరలో కొండ ఉన్నా లేదా ఏదైనా ప్రాంతం కాస్త ఎత్తుగా ఉన్నా కూడా మృతదేహాన్ని ఇలా వెదురుతో వేలాడదీస్తారు. ఇలా చేయడం వల్ల తమ పూర్వీకుల జ్ఞాపకార్థం భవిష్యత్ తరాలకు తెలుస్తుందట.
మృతదేహాన్ని వెదురుకి పొడిచి కొండ ప్రాంతంలో పెట్టడం వల్ల ఈ తెగ వారి పూర్వీకుల ఆశీర్వాదం ఉంటుందని, ఎల్లప్పుడూ తమని రక్షిస్తారని నమ్ముతారు. మరణించిన వారికి గౌరవం ఇస్తూ మృతదేహాలని ఇలా రక్షిస్తారట. ఈ మృతదేహాలు వారికి స్మారక చిహ్నాలు మాత్రమే కాదు.. చరిత్ర, సంస్కృతిలో ఒక భాగం. ఈ తెగల వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈ ఆచారాన్ని ఈ తెగలు పాటిస్తారు. పాపువా న్యూ గినియా వింత ఆచారాలు, సంప్రదాయాలు చాలానే ఉన్నాయి. వీటిని చూడటానికి కూడా చాలా మంది పర్యాటకులు వెళ్తుంటారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ చాలా వింత సంప్రదాయాలు ఉన్నాయి. అయినా చాలా మంది వెళ్తుంటారు. గతంలో మృతదేహాలను పూడ్చేవారు. కానీ ప్రస్తుతం ఎక్కువగా దహనం చేస్తున్నారు. పిల్లలు లేదా కొన్ని మతాల వారు మాత్రమే మృతదేహాన్ని పూడ్చుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.