Property Rights: తల్లిదండ్రులకు తమ పిల్లల ఆస్తిపై హక్కులు ఉన్నాయా? చట్టం ఏం చెబుతుంది?

Property Rights: సాధారణంగా మనం తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లల హక్కుల గురించి చర్చిస్తాము. కానీ పిల్లల ఆస్తిపై తల్లిదండ్రుల హక్కుల గురించి ఎప్పుడూ చర్చించము.


తరచుగా, ఒక ప్రశ్న మన మనస్సులో మెదులుతుంది అదేంటి అంటే? తల్లిదండ్రులు తమ పిల్లల ఆస్తిపై హక్కులను బదిలీ చేయగలరా? బహుశా చాలా తక్కువ మందికి దీని గురించి తెలుసు. అయితే పదండి తెలుసుకుందాం…

చట్టం ప్రకారం, తల్లిదండ్రులకు వారి పిల్లల ఆస్తిపై పూర్తి హక్కులు లేవు. కానీ ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా బిడ్డ మరణించిన సందర్భంలో వీలునామా లేనప్పుడు, తల్లిదండ్రులు తమ పిల్లల ఆస్తిపై తమ హక్కులను బదిలీ చేయవచ్చు. అయితే దాని కొంచెం ప్రాసెస్ ఉంటుంది.

పిల్లల ఆస్తిపై తల్లిదండ్రులకు ఉన్న హక్కులు ఏమిటి?:
ఒక బిడ్డ ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా అకాల మరణిస్తే లేదా వీలునామా రాయకుండా మరణిస్తే, అటువంటి పరిస్థితిలో, తల్లిదండ్రులు పిల్లల ఆస్తిని నియంత్రించవచ్చు. అయితే, ఈ నియంత్రణ పూర్తి కాకపోవచ్చు కూడా. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం, పిల్లల ఆస్తిపై తల్లిదండ్రుల హక్కులను పేర్కొన్నారు. ఈ సెక్షన్ కింద, తల్లిని మొదటి వారసురాలిగా, తండ్రిని పిల్లల ఆస్తికి రెండవ వారసుడిగా పరిగణిస్తారు. ఈ విషయంలో తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరణించిన వ్యక్త తల్లి లేకపోతే, అటువంటి పరిస్థితిలో తండ్రికి ఆ ఆస్తిపై హక్కు వస్తుంది.

హిందూ వారసత్వ చట్టం ప్రకారం:
మరణించిన వ్యక్తి కొడుకు అయితే, అతని ఆస్తిపై తల్లికి మొదటి హక్కు, తండ్రికి రెండవ హక్కు ఉంటుంది. తల్లి జీవించి లేకపోతే, తండ్రి, అతని సహ వారసులు ఆస్తిపై హక్కు వచ్చే అవకాశం ఉంది. కొడుకు వివాహం చేసుకుని వీలునామా రాయకుండానే మరణిస్తే, అతని భార్య హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం ఆస్తిని వారసత్వంగా పొందుతుంది. అటువంటి పరిస్థితిలో, కొడుకు ఆస్తిపై మొదటి హక్కు అతని భార్యకే చెందుతుంది.

మరణించిన వ్యక్తి కుమార్తె అయితే, ఆస్తిపై మొదటి హక్కు ఆమె భర్త, పిల్లలకు ఇస్తారు. దీనికి విరుద్ధంగా, ఒక కుమార్తె వివాహం చేసుకోకుండానే వీలునామా రాయకుండా మరణిస్తే, ఆమె ఆస్తిపై తల్లిదండ్రులకు మొదటి హక్కు ఉంటుంది. వివాహిత కుమార్తె తన భర్తతో పాటు ఆస్తికి సహ యజమానిగా ఉండి, ఆమె వీలునామా రాయకుండా మరణిస్తే, ఆమె తల్లిదండ్రులకు ఆమె ఆస్తిలో వాటా హక్కు ఉండవచ్చు. అయితే, అది సంపద స్వయంగా సంపాదించిందా లేదా వారసత్వంగా నుండి వచ్చిందా అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది.