ప్రతి క్రీడలో గెలిచిన క్రీడాకారులు ఒలింపిక్ పతకాలు పొందుతారని అందరికీ తెలుసు. ప్రథమ స్థానంలో నిలిచిన వారికి బంగారు పతకం, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రజత పతకం, తృతీయ స్థానంలో నిలిచిన వారికి కాంస్య పతకం అందజేస్తారు.
అనేక పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచిన వారికి కూడా కాంస్య పతకాలు కూడా అందజేస్తారు.
ఈఫిల్ టవర్ నుండి సేకరించిన ఇనుప ముక్కను పారిస్ ఒలింపిక్స్ తో పాటు పారాలింపిక్ పతకాల తయారీ కోసం ఉపయోగించారు. ఒలింపిక్స్ క్రీడలు పారిస్‌లో మూడో సారి జరుగుతున్న సందర్భంగా ఈఫిల్ టవర్ లోని ఇనుప ముక్కలను పతకంలో చేర్చాలని నిర్ణయించారు. ఒక్కో మెడల్‌లోని ఈఫిల్ టవర్ ముక్క 18 గ్రాముల బరువు ఉంటుంది.
పారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ కోసం మొత్తం 5084 పతకాలను తయారు చేశారు. ఇందులో ఒక్కో మెడల్ మందం 9.2 మిమీ కాగా దాని వ్యాసం 85 మిమీ. బంగారు పతకం 529 గ్రాములు, వెండి పతకం 525 గ్రాములు. కాంస్య పతకం బరువు 455 గ్రాములు.
ఈ పతకాల తయారీ గురించి చెబుతూ ఒలింపిక్స్‌లో ఇచ్చే గోల్డ్ మెడల్‌లో 92.5 శాతం, వెండి, 6 గ్రాముల బంగారం ఉంది. ఒక వెండి పతకం 92.5 శాతం వెండితో తయారు చేయబడింది. అయితే కాంస్య పతకంలో 97 శాతం రాగి, 2.5 శాతం జింక్, 0.5 శాతం టిన్ ఉంటాయి.
అలాగే ఒక్కో పతకం ధర ఎంత అంటే.. ఒక్కో ఒలింపిక్ మెడల్ ధర ఒక్కోలా ఉంటుంది. దీని ప్రకారం ఒక బంగారు పారిస్ ఒలింపిక్స్ లో ఇచ్చే పసిడి పతకం ఖరీదు రూ. 75 లక్షలు ఉంటే, మిగిలిన వెండి, కాంస్య పతకాలకు వరుసగా రూ. 50 లక్షలు, రూ. 30 లక్షలు ఉంటుంది