పాశమైలారం పేలుడు ఘటన.. 45 మంది మృతి

పటాన్‌చెరులోని పాశమైలారంలో పెనువిషాదం చోటుచేసుకుంది. నిన్న(సోమవారం) సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్‌లో ఈ ఘటన జరిగింది.


ఈ పేలుడు ఘటనలో (Pashmailaram Blast) 37 మంది కార్మికులు మృతిచెందారు. వీటిలో నాలుగు మృతదేహాలను గుర్తించారు. ఇంకా కార్మికుల మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. మృతులు, క్షతగాత్రులు బీహార్‌, ఒడిసా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాసులుగా గుర్తించారు. అయితే.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు పలు ఆస్పత్రుల్లో 35 మంది కార్మికులకి చికిత్స అందిస్తుండగా, 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. తెలంగాణ చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. ఘటనాస్థలిలో సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్‌ఎఫ్, హెడ్రా, రెవెన్యూ, పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.