ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి 30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు.
దీంతో ఈ 4 రోజులు ఆయన స్థానంలో పవన్ కళ్యాణ్కు ఇన్ఛార్జ్ సీఎంగా బాధ్యతలు అప్పగించారు.
Pawan Kalyan
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సింగపూర్కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ కూడా సింగపూర్ పర్యటనలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిపాలనా వ్యవహారాలు సజావుగా సాగేందుకు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ను నియమించారు.
అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది:
పవన్ కళ్యాణ్కు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నారనే వార్తలు వస్తున్నప్పటికీ.. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి పవన్ కళ్యాణ్ ఈ బాధ్యతలను నిర్వర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జనసైనికుల్లో ఆనందం
పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సామర్థ్యం, పరిపాలనా దక్షతను నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని జనసేన నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు.
































