Pawan Kalyan vs Prakash Raj: నువ్వు నందా అయితే.. నేను బద్రి.. బద్రినాథ్.. ఇది బద్రి వర్సెస్ నంద.. బద్రి సినిమాలో ఈ ఇద్దరి ఫైట్ ఓరేంజ్‌లో ఉంటుంది.
సిల్వర్ స్ర్కీన్‌పై పవన్ కల్యాణ్, ప్రకాష్‌రాజ్ ఫైట్ పెద్ద హిట్టే కొట్టింది.. ఇక, పొలిటికల్ పిచ్‌పై కూడా ఈ ఇద్దరూ సెటైర్లు, కౌంటర్లతో విరుచుకుపడుతుంటారు. అవకాశం వచ్చిన ప్రతీసారీ.. పవన్‌కు కౌంటరిస్తుంటారు ప్రకాష్‌రాజ్. లేటెస్ట్గా నిన్న చిత్రాడలో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు ప్రకాష్‌రాజ్..
#justasking ట్యాగ్‌తో ఇప్పటికే పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్‌పై సెటర్లు, కౌంటర్లు ఇచ్చిన ప్రకాష్.. ఇప్పుడు.. హిందీ భాష, తమిళ సినిమాల డబ్బింగ్‌పై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌కు కౌంటరిచ్చారు. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దన్నారు పవన్ కల్యాణ్… భాష వద్దు కానీ.. డబ్బులు కావాలా అంటూ పవన్ ప్రశ్నించారు. ఈ కామెంట్స్ స్పందించిన ప్రకాష్‌రాజ్.. “మీ హిందీ భాషను మా మీద రుద్దకండి”, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, ” స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం”, అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please…
#justasking.. అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్.. అయితే, ఎక్స్‌లో ప్రకాష్‌రాజ్ పెట్టిన పోస్టుకు కొందరు అనుకూలంగా కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు ప్రకాష్ రాజ్‌ను టార్గెట్ చేసి కామెంట్లలో ఫైర్ అవుతున్నారు..
https://x.com/prakashraaj/status/1900604746815402494?t=LzHnJ3D-PaGT-e5U0YxI3A&s=19