ప్రతి నెలా EMIలు కడుతున్నారా? మీకు RBI నుంచి సూపర్ గుడ్ న్యూస్

www.mannamweb.com


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పనుంది. ప్రజలు ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పరిస్థితులు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వచ్చే అక్టోబర్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. పాలసీ రేట్లను సమీక్షించనుంది. అప్పుడు ఖరీదైన EMIల వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి 2023 నుంచి రెపో రేటులో ఎలాంటి మార్పులు జరగలేదు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ టార్గెట్‌కు అనుగుణంగా ద్రవ్యోల్బణం నమోదు కావడంతో వడ్డీ రేట్లు తగ్గించవచ్చని విశ్లేషణల ద్వారా తెలుస్తుంది.

వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతానికి తగ్గడం ఐదేళ్లలో ఇదే మొదటి సారి. దీంతో సెంట్రల్ బ్యాంక్ రెపో రేట్లు తగ్గించినట్లైతే, అందుకు అనుగుణంగా సాధారణ ప్రజలు నెలవారీ EMIలు కూడా తగ్గుతాయి. రాబోయే ద్రవ్య విధాన సమీక్షలో దీనిపై RBI నిర్ణయం తీసుకోవచ్చు. పాలసీ రేటును నిర్ణయించేటప్పుడు ఆర్థిక సూచికలతో పాటు రిటైల్ ద్రవ్యోల్బణం డేటాను కూడా RBI దృష్టిలోకి తీసుకుంటుంది. అది పెరిగినప్పుడు వడ్డీ రేట్లను పెంచడం, తగ్గినప్పుడు తగ్గించడం సర్వ సాధారణం. ఆగస్టు 8 2024న జరిగిన ద్రవ్య సమీక్షలో వరుసగా తొమ్మిదోసారి రెపో రేటును 6.5 శాతంగా స్థిరంగా కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి వచ్చే మీటింగ్‌లో కూడా రేట్ల తగ్గింపు గురించి సెంట్రల్ బ్యాంక్‌పై ఒత్తిడి ఉంటుందని తెలుస్తుంది.

ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో వేసిన అంచనా ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రుతుపవనాలు మెరుగయ్యాయి. అందువల్ల ఎక్కువగా పంటలు పండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ పంటలు వేయడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం కూడా బాగుంటుందని క్రిసిల్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా రెండు సార్లు వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ ఉందని క్రిసిల్ వేసిన అంచనాలో తెలిసింది. అదే గనుక జరిగితే ప్రజలకు అధిక వడ్డీ రేట్ల భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. చూడాలి మరి ఈ ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ రేట్లు ఎలా ఉంటాయో